Tuesday, 14 July 2026
  • Home  
  • యువతితో అసభ్య ప్రవర్తన కేసు.. నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువతితో అసభ్య ప్రవర్తన కేసు.. నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్

కొండాపురం మండలం నేకునాంపేట గ్రామంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 18న అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు జూన్ 24న కొండాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సేకరించిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.