Sunday, 23 August 2026

Blog

విశాఖపట్నం

మహాధర్నాని జైప్రధం చేయండి

గాజువాక, (పున్నమి ప్రతినిధి), ఆగష్టు22 :విశాఖ ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపుమేరకు విశాఖపట్నం జి వి ఎం సి ఎదురుగా శ్రీ మహాత్మా గాంధీ గారు విగ్రహం ప్రక్కన ఉన్న విశాఖ ఉక్కు పోరాట కమిటీ నిరాహార దీక్ష శిబిరం వద్ద రేపు 23-08-26 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే మహాధర్నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐ ఎన్ టి యు సి నాయకులు కార్యకర్తలు విశాఖ ఉక్కు వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాధర్నాన్ని విజయవంతం చేసి తద్వారా ఉక్కు యాజమాన్యానికి మన యొక్క నిరసన తెలియజేయవలసిందిగా జాతీయ ఐఎన్టియుసి సీనియర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

చిరంజీవి సేవా స్ఫూర్తితో జన్మదిన వేడుకలు.. ప్రజాసేవే నిజమైన అభిమానం! విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు.. అభిమానులను అభినందించిన సామినేని ఉదయభాను

విజయవాడ సినీ రంగంలో స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగి, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మారినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. స్వయంకృషితో సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి, తన అభిమానుల ద్వారా సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంక్ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఆయన.. రాజకీయ ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. అభిమానం అంటే కేవలం జేజేలు కొట్టడం కాదు.. ఆ అభిమాన వ్యక్తి చూపిన మంచి మార్గాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన అభిమానం అని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు. జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట సాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రదానం, పేదలకు అన్నదానం చేపట్టారు. చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో అభిమానులు తమ అభిమానాన్ని సమాజ సేవగా మలచడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని సామినేని ఉదయభాను అన్నారు. అవసరంలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి చిరంజీవి అభిమానిని జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రివిజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, కందివలస అచ్చిత తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

SIR నోటీసుల పంపిణీ 100% పూర్తి చేయాలి

నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్‌లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

బాధితుల కన్నీరు తుడిచే కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధితో ఆపన్నులకు ఆర్థిక భరోసా — విజయవాడ తూర్పులో చెక్కుల పంపిణీ

విజయవాడ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని చాటిచెబుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోబాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తో కలిసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆపదలో అండగా…సంక్షేమం లో ముందడుగుఅనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరట కల్పిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాల్లోఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చనితెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, అవసరమైన సమయంలో అండగా నిలిచే ప్రజాప్రతినిధులే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తారని అన్నారు. కూటమి నేతల ఐక్యతతో ప్రజాసేవకు మరింత బలం ఈ కార్యక్రమం లో విజయవాడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రీజినల్ కోఆర్డినేటర్ *రావి సౌజన్య, కంది వలస అచ్చిత* తో పాటు జనసేన పార్టీ వీర మహిళలు పాల్గొని బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు. “ప్రజల కష్టమే మా కష్టం… ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా లక్ష్యం” అనే సందేశంతో నాయకులు ముందుకు సాగారు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా — బాధితులకు భరోసాగా, ప్రజలకు అండగా కూటమి నాయకత్వం ముందుకు సాగుతోంది.

విశాఖపట్నం

ఉయ్యూరులో డయేరియా.. మంత్రి నారాయణ పర్యటన*

ఉయ్యూరు, ఆగస్టు 21: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ 5, 7 వార్డుల్లో డయేరియా ప్రబలడంతో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డయేరియా కారణాలపై నీటి శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

హైదరాబాద్

సురేఖ వివరణపై నిర్ణయం వాయిదా

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదు, ఆయన వివరణను కూడా సమీక్షించామని తెలిపారు. ఆదిలాబాద్ వివాదం, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్, సిద్ధిపేట–గజ్వేల్ ఘటనలపై కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు. కొండా సురేఖ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్యలపై ఇప్పుడే గడువు చెప్పలేమని మల్లు రవి స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వికసిత భారత్‌కు యువతే బలం

నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్–2047’ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.బి. రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజయభారతి విద్యార్థులకు మానవ హక్కులు, రాజ్యాంగ బాధ్యతలపై అవగాహన కల్పించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని, కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణవేణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దోర్నాధుల వెంకటేశ్వర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

పల్నాడు

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్ మాచర్ల మండల ప్రతినిధి ఆగస్టు 22. రాజుపాలెం . పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామంలో శనివారం ఘనంగా జరిగాయి. సర్పంచ్ పులిబండ్ల అశోక్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చీ భారీ కేకును కోసి చిన్నారులకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పగడాల శ్రీనివాసరావు, సఖినాల ధర్మారావు, కేదారి రమేష్, చిట్టెంశెట్టి గోపి, చంద్రశేఖర్ నాయక్, చొక్కా మల్లికార్జున రావు, పెమ్మా చిన చెన్నయ్య, వసంతపు చిన వెంకటేశ్వర్లు, పులిబండ్ల అంకమ్మరావు, సమారి సైదారావు, ఆకుల కోటేశ్వరరావు, మొర్రిబోయిన రామాంజనేయులు, కాంట్రగుంట వెంకటేశ్వర్లు, పోతంశెట్టి వెంకట్రామయ్య, గుబిలి కోటేశ్వరరావు వందలాది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు

హస్నాబాద్ తండాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై హియరింగ్

పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 22: మాచర్ల మండలం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా మాచర్ల రూరల్ మండలంలోని హస్నాబాద్ తండాలో హియరింగ్ ప్రక్రియ నిర్వహించారు. అర్హులైన ఓటర్ల వివరాలు, దరఖాస్తులు మరియు అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని హియరింగ్ ప్రక్రియను నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు

తిరుపతి

రేపే ఘనంగా ప్రారంభం!*కుప్పారెడ్డిపాలెం లో

*రేపే ఘనంగా ప్రారంభం!* *RAJA’S COOL DRINKS & GENERAL STORE* దొరవారిసత్రం మండల ప్రజలకు శుభవార్త! మీ కుప్పరెడ్డిపాలెం హైవేలో *రాజా కూల్ డ్రింక్స్ & జనరల్ స్టోర్* రేపు *ఆదివారం (24.08.2025)* ఘనంగా ప్రారంభం కాబోతోంది. మా వద్ద లభించును: కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ & స్నాక్స్, షాంపూస్, సోప్స్, సర్ఫ్, కొల్గేట్ మరియు అన్ని నిత్యావసర సరుకులు – అన్నీ ఒకే చోట, బెస్ట్ క్వాలిటీ – బెస్ట్ సర్వీస్ తో! *ప్రతి ఒక్కరూ విచ్చేసి మా నూతన షాప్ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయగలరు.* *స్థలం:* కుప్పరెడ్డిపాలెం హైవే, దొరవారి సత్రం *ప్రొప్రయిటర్: K. రాజా రత్నం* *ఫోన్: 6281110783* *Daily Needs – Everything Under One Roof!*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.