Sunday, 23 August 2026

Blog

నంద్యాల

నంద్యాల జిల్లాస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పోటీలను ప్రారంభించారు.12 వయసు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా, ప్రతి కేటగిరీలో 10 చొప్పున మొత్తం 120 బహుమతులు అందించనున్నట్లు సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. సుమారు 200 మంది క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నంద్యాల

పర్యావరణహిత వినాయక చవితికి జిల్లా యంత్రాంగం పిలుపు

నంద్యాల: వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగుల విగ్రహాలను వినియోగించకుండా మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రజలకు పిలుపునిచ్చారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న నంద్యాల జిల్లా కేంద్రంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. POP విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నందున పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ చేపడతారని, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

నంద్యాల

వినాయక చవితి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

నంద్యాల : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, ఫైర్ సేఫ్టీ, ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నంద్యాల

వినాయక చవితి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

నంద్యాల : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, తాగునీరు, పారిశుధ్యం, ఫైర్ సేఫ్టీ, ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, అంబులెన్సులు తదితర సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో రహదారుల మరమ్మతులు పూర్తి చేసి, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రూట్ మ్యాప్, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్‌ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విశాఖపట్నం

మహాధర్నాని జైప్రధం చేయండి

గాజువాక, (పున్నమి ప్రతినిధి), ఆగష్టు22 :విశాఖ ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపుమేరకు విశాఖపట్నం జి వి ఎం సి ఎదురుగా శ్రీ మహాత్మా గాంధీ గారు విగ్రహం ప్రక్కన ఉన్న విశాఖ ఉక్కు పోరాట కమిటీ నిరాహార దీక్ష శిబిరం వద్ద రేపు 23-08-26 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే మహాధర్నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐ ఎన్ టి యు సి నాయకులు కార్యకర్తలు విశాఖ ఉక్కు వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాధర్నాన్ని విజయవంతం చేసి తద్వారా ఉక్కు యాజమాన్యానికి మన యొక్క నిరసన తెలియజేయవలసిందిగా జాతీయ ఐఎన్టియుసి సీనియర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

చిరంజీవి సేవా స్ఫూర్తితో జన్మదిన వేడుకలు.. ప్రజాసేవే నిజమైన అభిమానం! విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు.. అభిమానులను అభినందించిన సామినేని ఉదయభాను

విజయవాడ సినీ రంగంలో స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగి, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మారినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. స్వయంకృషితో సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి, తన అభిమానుల ద్వారా సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంక్ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఆయన.. రాజకీయ ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. అభిమానం అంటే కేవలం జేజేలు కొట్టడం కాదు.. ఆ అభిమాన వ్యక్తి చూపిన మంచి మార్గాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన అభిమానం అని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు. జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట సాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రదానం, పేదలకు అన్నదానం చేపట్టారు. చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో అభిమానులు తమ అభిమానాన్ని సమాజ సేవగా మలచడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని సామినేని ఉదయభాను అన్నారు. అవసరంలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి చిరంజీవి అభిమానిని జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రివిజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, కందివలస అచ్చిత తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

SIR నోటీసుల పంపిణీ 100% పూర్తి చేయాలి

నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్‌లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

బాధితుల కన్నీరు తుడిచే కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధితో ఆపన్నులకు ఆర్థిక భరోసా — విజయవాడ తూర్పులో చెక్కుల పంపిణీ

విజయవాడ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని చాటిచెబుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోబాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తో కలిసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆపదలో అండగా…సంక్షేమం లో ముందడుగుఅనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరట కల్పిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాల్లోఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చనితెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, అవసరమైన సమయంలో అండగా నిలిచే ప్రజాప్రతినిధులే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తారని అన్నారు. కూటమి నేతల ఐక్యతతో ప్రజాసేవకు మరింత బలం ఈ కార్యక్రమం లో విజయవాడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రీజినల్ కోఆర్డినేటర్ *రావి సౌజన్య, కంది వలస అచ్చిత* తో పాటు జనసేన పార్టీ వీర మహిళలు పాల్గొని బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు. “ప్రజల కష్టమే మా కష్టం… ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా లక్ష్యం” అనే సందేశంతో నాయకులు ముందుకు సాగారు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా — బాధితులకు భరోసాగా, ప్రజలకు అండగా కూటమి నాయకత్వం ముందుకు సాగుతోంది.

విశాఖపట్నం

ఉయ్యూరులో డయేరియా.. మంత్రి నారాయణ పర్యటన*

ఉయ్యూరు, ఆగస్టు 21: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ 5, 7 వార్డుల్లో డయేరియా ప్రబలడంతో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డయేరియా కారణాలపై నీటి శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

హైదరాబాద్

సురేఖ వివరణపై నిర్ణయం వాయిదా

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదు, ఆయన వివరణను కూడా సమీక్షించామని తెలిపారు. ఆదిలాబాద్ వివాదం, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్, సిద్ధిపేట–గజ్వేల్ ఘటనలపై కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు. కొండా సురేఖ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్యలపై ఇప్పుడే గడువు చెప్పలేమని మల్లు రవి స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.