Wednesday, 8 July 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం – స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే
- జనగాం

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం – స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, సంబంధిత శాఖల అధికారులను కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై వినతులు సమర్పించడం ఒక ప్రజాప్రతినిధిగా నా రాజ్యాంగబద్ధమైన హక్కు, బాధ్యత. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ గారిని వారి కార్యాలయంలో కలిసి, నా నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి వినతిపత్రాలు అందజేశాను. ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు. ప్రభుత్వ బిజినెస్ రూల్స్, రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే వ్యవహరించాను. అయినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం, అనవసర వివాదాలకు తెరలేపడం బాధాకరం. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా నా అధికారాలు, బాధ్యతలు, పరిమితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్టు పురోగతి, ఎంజీఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ల పూర్తి చేసి పనులు ప్రారంభించడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం, అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అధికారాన్ని అభివృద్ధి, సంక్షేమం కోసం వినియోగించాలి. అనవసర వివాదాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మేలు చేస్తుంది.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, సంబంధిత శాఖల అధికారులను కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై వినతులు సమర్పించడం ఒక ప్రజాప్రతినిధిగా నా రాజ్యాంగబద్ధమైన హక్కు, బాధ్యత.
ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ గారిని వారి కార్యాలయంలో కలిసి, నా నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి వినతిపత్రాలు అందజేశాను. ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు. ప్రభుత్వ బిజినెస్ రూల్స్, రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే వ్యవహరించాను.
అయినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం, అనవసర వివాదాలకు తెరలేపడం బాధాకరం. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా నా అధికారాలు, బాధ్యతలు, పరిమితులపై నాకు పూర్తి అవగాహన ఉంది.
ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్టు పురోగతి, ఎంజీఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ల పూర్తి చేసి పనులు ప్రారంభించడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం, అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అధికారాన్ని అభివృద్ధి, సంక్షేమం కోసం వినియోగించాలి. అనవసర వివాదాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మేలు చేస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.