Sunday, 23 August 2026

Blog

తిరుపతి

యనమల భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పగడాల శివకుమార్

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రాష్ట్ర కమిటీలో యనమల భాస్కర్‌కు స్థానం కల్పించడంపై చిట్వేలి మండలం టౌన్ చిరంజీవి యువత అధ్యక్షుడు పగడాల శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలు నచ్చి ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో భాస్కర్ రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. నిజాయితీ, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తున్న భాస్కర్‌కు కీలక బాధ్యత అప్పగించడం సముచిత నిర్ణయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శివకుమార్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగుతామన్నారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి తనను ఆకట్టుకుందని, ఆయన స్థాపించిన జనసేనలో కొనసాగడం గర్వంగా ఉందని శివకుమార్ పేర్కొన్నారు.

తిరుపతి

క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయులకు శిక్షణ

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల నమోదు, హాజరు, గత విద్యా సంవత్సరం ఫలితాల సమీక్ష, సిలబస్ పూర్తి, అభ్యసన లోపాలు, క్లిష్టమైన అంశాలు, తదుపరి నెల పాఠ్య ప్రణాళికపై చర్చించారు. జీసీడీఓ పుష్ప, ఎంఈఓ – 1 ఖాజా మొయిద్దీన్, ఎంఈఓ – 2 ఈశ్వరయ్య సమావేశాన్ని పర్యవేక్షించారు. ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 100 శాతం స్ట్రీమ్ పాఠశాలలపై దృష్టి, కార్యాచరణ ప్రణాళిక, ఎండ్‌లైన్ పరీక్ష ఫలితాల విశ్లేషణ తదితర అంశాలను వివరించారు. సెకండరీ స్థాయిలో మిషన్ మార్చ్ ఎస్‌ఎస్‌సీ – 2027 అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఫలితాల విశ్లేషణ, సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పరీక్షలకు ముందు వేగవంతమైన పునశ్చరణ, ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించే విధానాలపై అవగాహన కల్పించారు. వెంకటరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ – 1 ఖాజా మొయిద్దీన్ తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణలో చురుకుగా పాల్గొని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్, అమర్‌నాథ్, ఐఈడీ ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, చిట్వేల్, పెనగలూరు మండలాల గణిత, సాంఘిక శాస్త్ర రిసోర్స్‌ పర్సన్లు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ చంద్ర పాల్గొన్నారు.

కాకినాడ

ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసిపి అండగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు ఆపి, సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జమ్మలమడక నాగమణి

కాకినాడ.ఆగస్ట్ 22 : కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని లేదా కూటమి నాయకులను ఏ విషయంలోనైనా ప్రశ్నిస్తే “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, సస్పెన్షన్లతో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాల్లో చేరే నాటికి లేని టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని (కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన టీచర్లు) అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న లక్షలాది మంది సీనియర్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే వారు చేసిన నేరమా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఐఆర్, మెరుగైన పిఆర్సి , అమలు చేయకపోగా, పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు దాదాపు రూ. 35,000 కోట్ల నుండి రూ. 40,000 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ధ్వజమెత్తారు.తమ న్యాయమైన హక్కులు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా నిలిచి, వారి పోరాటానికి మద్దతుగా న్యాయపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసీపీ అండగా ఉంటుందని జమ్మలమడక నాగమణి అన్నారు.

కాకినాడ

రూరల్‌ నియోజకవర్గంలో CMRF ద్వారా రూ. 3.44 కోట్ల వైద్య సాయం:* *పేద ప్రజల ఆపద్బాంధవులు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు*

ఆరోగ్యాంధ్ర ప్రదేశే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో నేటివరకు సుమారు 353 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకున్నారు. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ శాసన సభ్యుల వారి కార్యాలయం నందు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 18 (పద్దెనిమిది) మందికి రియంబర్స్మెంట్ మరియు 2 (ఇద్దరికీ) LOCలతో కలిపి మొత్తం 20 మందికి మంజూరు అయిన 19,35,426/- రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు శ్రీ పంతం సందీప్ గారు కూటమి నాయకులు చిక్కాల రామచంద్ర రావు గారు, డా. చప్పిడి వెంకటేశ్వర రావు గారు, పితాని లీల గారు, బోళ్ళ కృష్ణ మోహన్ గారు, వల్లూరి రాజా గారు, నల్లే ప్రసన్న కుమార్ గారు, మట్టపర్తి ప్రకాష్ గౌడ్ గారు, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, కరెడ్ల గోవింద్ గారు, బండారు మురళి గారు, తిరుమాని కుమార స్వామి గార్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుండి సీఎంఓ కార్యాలయానికి 500 అప్లికేషన్స్ పంపించగా ఈనాటికి సుమారు 353 మందికి 3,44,08,099/-రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన 147 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నల్లం శ్రీరాములు గారు, అద్దంకి వీరబాబు గారు, ర్యాలీ సతీష్ గారు, తాటికాయల వీరబాబు గారు, పుల్ల శ్రీరాములు గారు, పుల్ల వీరబాబు గారు, సోదే ముసలయ్య గారు, పితాని గన శివ తేజ గారు, గరికిన సురేష్ గారు, వానపల్లి వెంకట రమణ గారు, గరగ శ్రీనివాస్ గారు, గంటా నాని బాబు గారు, రామిశెట్టి సునీల్ గారు, తోటకూర సతీష్ గారు, చోల్లు ఇమ్మాన్యుయేల్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, వాసంశెట్టి త్రిమూర్తులు గారు, వాసంశెట్టి వెంకటేశ్వర రావు గారు, లావణ్య గారు, డి స్వాతి గారు, సుందర సత్తిబాబు గారు, గంజా వర ప్రసాద్ గారు, మారెళ్ల శివ గారు, యలమంచిలి భాస్కర రావు గారు, కనపర్తి చిన్న గారు, శాండీ గారు, గరగ రామ్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, చోడిశెట్టి గంగాధర్ గారు, యర్రంనీడి ప్రసాద్ గారు, పబ్బినీడి ప్రదీప్ గారు, దౌలూరి సత్యనారాయణ గారు, గుమ్మెళ్ల సుబ్రహ్మణ్యం గారు, ఆచంట వీరబాబు గారు, కూటమి శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మకు ఘన సత్కారం

తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి తిరుపతి అలిపిరి రోడ్డులోని ఎస్వీబీసీ కార్యాలయంలో నూతనంగా నియమితు లైన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి శ్రీధర్ వర్మ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.సి. మునికృష్ణ పాల్గొని నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా, గతంలో తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విషయాన్ని గుర్తిస్తూ శ్రీధర్ వర్మ గారికి జ్ఞాపికను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ను మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మరింత చేరువగా తీసుకెళ్లే విధంగా శ్రీధర్ వర్మ సేవలు కొనసాగాలని, ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఆర్.పి. శ్రీనివాసులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, గంజి సుధాకర్ రెడ్డి, జగ్గా రవి, శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నాగ ప్రతాప్, ప్రసాద్, శీను, సుధీర్, ముని దేవాచారి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మకు ఘన సత్కారం

తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి తిరుపతి అలిపిరి రోడ్డులోని ఎస్వీబీసీ కార్యాలయంలో నూతనంగా నియమితు లైన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి శ్రీధర్ వర్మ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.సి. మునికృష్ణ పాల్గొని నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా, గతంలో తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విషయాన్ని గుర్తిస్తూ శ్రీధర్ వర్మ గారికి జ్ఞాపికను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ను మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మరింత చేరువగా తీసుకెళ్లే విధంగా శ్రీధర్ వర్మ సేవలు కొనసాగాలని, ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఆర్.పి. శ్రీనివాసులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, గంజి సుధాకర్ రెడ్డి, జగ్గా రవి, శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నాగ ప్రతాప్, ప్రసాద్, శీను, సుధీర్, ముని దేవాచారి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ఎస్‌వీబీసీ చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

తిరుపతి, ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, టీటీడీ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి

ఉచిత నిర్భంద విద్యకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి ఉచిత నిర్భంద విద్యకు కేంద్ర ప్రభుత్వ విధానాలు తూట్లు పొడుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఈశ్వరయ్య శనివారం తెలియ చేశారు. భారత రాజ్యాంగ ప్రకారం విద్య మొట్టమొదటగా రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. దీని ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చట్టాలు చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఈ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1986 ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత సాంకేతిక విద్యకు ఊహించనంత ఊతం ఇచ్చింది. ఈ సాంకేతిక విద్య వలననే యువత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలను ఇన్‌కమ్ టాక్స్ రూపంలో చెల్లిస్తున్నారు. జాతీయ విద్యా విధానం 1986 తరువాత ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థలకు (టెక్) దిగ్గజాలుగా నాయకత్వం వహిస్తున్న భారతీయ విద్యార్థులు మేధస్సుకు, జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత విద్యాసంస్థల ప్రవేశాలకు నిర్వహించే పోటీ పరీక్షలలోను, వివిధ ఉద్యోగాల కొరకు నిర్వహించే పరీక్షలలోను, 25-30 శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంబంధించిన విద్యార్థులే ఉండటానికి ప్రధాన కారణం పాఠశాల స్థాయిలోను, ఉన్నత విద్యా స్థాయిలోను నాణ్యమైన పాఠ్య ప్రణాళికతోపాటు అంకిత భావం గల ఉపాధ్యాయులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 2014 తరువాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం బట్టీ విధానాలకు స్వస్తి పలకాలనీ, శాస్తీయ విద్యా విధానంలోనే బోధన చేయాలని, విద్యార్ధికి కేంద్రీకృతంగా కృత్యాధాధార బోధననే ప్రధానం అంటూ పదే పదే ప్రభుత్వాలు చిలక పలుకులు పలకడం నిజమేనని ఉపాధ్యాయులు భావించారు. గణితంలో ఎక్కాలు, సూత్రాలు బట్టీ కొట్టకుంటే గణితానికి అర్థం ఉంటుందా. కానీ 2020 పుణ్యామా అని ఎన్‌సిఈఆర్‌టి/ఎస్‌సిఈఆర్‌టి కొత్తగా మార్చిన పాఠ్య పుస్తకాలలోని విషయం పరిజ్ఞాన్నాన్ని పరిశీలిస్తే అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కానిదనీ, ఈ పాఠ్య పుస్తకాలలోని విషయ పరిజ్ఞానంతో గుమాస్తాలను కూడా తయారు చేయలేమని, మరీ ముఖ్యంగా గణిత పాఠ్య పుస్తకాలలో విషయ పరిజ్ఞానం గణిత ఉపాధ్యాయులను సహితం విస్మయం కలిగిస్తుంది. అంతేగాక నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రభుత్వ ప్రాథమిక విద్యా విధానాన్ని 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేయడమే ప్రధాన ఉద్దేశం అని ఎన్‌సిఈఆర్‌టి/ఎస్‌సిఈఆర్‌టి కొత్తగా మార్చిన పాఠ్య పుస్తకాలలోని విషయం పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రైవేట్, కార్పొరేటు విద్యా సంస్థలు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను ఏ మాత్రం వాడకుండా, నిబంధనలు విరుద్ధంగా ప్రముఖ గణిత రచయితలైన ఆర్.డి. శర్మ , ఆర్.ఎస్. అగర్వాల్, చాంద్ పబ్లికేషన్‌లచే తయారు చెయ్యబడిన నాణ్యమైన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రాంగణాల్లోనే అమ్మడాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పర్యవేక్ష అధికారుల తీరు ఒకవైపు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులపైనా వివక్ష మరొకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని అఘాతంలోకి నెట్టేస్తూ కార్పొరేటు విద్యాసంస్థకు రెడ్ కార్పెట్లు పరుస్తున్న వైనం బలహీన వర్గాల బడిపిల్లకు శాపం అవుతుందనడంలో సందేహం లేదు. పాఠశాల పనివేళ్లలోనే కర్మయోగి సామాజిక మాధ్యమం ద్వారా శిక్షణలు, యోగ దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశాలు లాంటి గిన్నిస్ ఈవెంట్లు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ ఆధారిత పనులు వంటి బోధనేతర పనులను సహితం పాఠశాల పనివేళల్లో వద్దంటూ మొత్తుకున్నప్పటికీ ప్రభుత్వాలు చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరిస్తున్నాయి. పరీక్ష విధానాల్లో సంస్కరణలంటూ పాఠశాల స్థాయిలో జరగవలసిన యూనిట్ పరీక్షలలో సైతం కేంద్రస్థాయిలో తయారు చేసిన ప్రశ్నపత్రం ప్రవేశపెట్టడం, వచ్చిన మార్కులను ఆన్లైన్ చేయమంటూ ప్రైవేటు పాఠశాలలకు సాఫ్ట్వేర్ తయారు చేయించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో గత 12 సంవత్సరాలుగా 95 ప్రతిష్టాత్మక ప్రశ్నపత్రాలు లీకులు చేయడం అత్యంత దుర్మార్గం. పాఠశాల్లో అడ్మిషన్లు ప్రారంభ నెల జూన్లో ఉపాధ్యాయులకు వివిధ రకాల శిక్షణలు, బదిలీలు, పదోన్నతులు వంటి కార్యక్రమాల పేరిట పాఠశాలకు దూరం చేయడం, అదే సమయంలో ప్రైవేట్, కార్పోరేటు విద్యా సంస్థలకు అడ్మిషన్లకు గేట్లు ఎత్తడం జరుగుతోంది. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ సెలవులను 60 నుండి 180 రోజులకు పెంచడం హర్షణీయమే కానీ వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించక పోవడాన్ని చూస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలపై ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధమవుతోంది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఇందులో సెక్షన్ 23 (1) నందు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన, అకాడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తయినా ఉపాధ్యాయునిగా నియమింపబడటానికి అర్హులనే నిబంధనలను అనుసరించి 2011 నుండి కొత్తగా నియమించబడే ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టిఈటి) నిర్వహించి, తదుపరి డిఎస్‌సి పరీక్షలో మెరిట్ వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ఒక మైనారిటి విద్యాసంస్థలో ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన కేసులో భారత ఉన్నత న్యాయస్థానం 2011కు ముందు నియమించబడిన సీనియర్ ఉపాధ్యాయులు సహితం టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టిఈటి) 3 సంవత్సరాలలో తప్పక పాస్ కావాలని లేదా ఉద్యోగాన్ని వదులుకోవాలనే నిబంధన విధించడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాల సంఖ్య, అందులో చదువుకొనే విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదే స్థాయిలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య, అందులో చదువుకొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే కారణం. 14 ఏళ్లలోపు బాల, బాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందించాలనే లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సమగ్ర విద్య, విజ్ఞానంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి, ఉచిత నిర్భంద విద్యను సక్రమంగా అమలుచేయాలని పాలకులకు హితవు పలుకుతున్నాం. అని పిలుపునిచ్చారు

ఎన్ టి ఆర్ జిల్లా

రహదారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి

విజయవాడ ఎంపీ కార్యాలయంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతలు ఎంపీ చిన్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, మారేమండ గ్రామ ప్రజల రహదారి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తాతకుంట్ల మెయిన్ రోడ్డు నుండి మిట్టగూడెం, మారేమండ, నరసాపురం కలుపుతూ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. కావున రోడ్డు వేయాలని కోరారు.

తిరుపతి

అమరావతి ఛాంపియన్ షిప్ – 2026 ఏర్పాట్లు పరిశీలించిన శాప్ చైర్మన్ రవి నాయుడు, కమిషనర్ ఎం. జయకృష్ణ

తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి ఆగస్ట్ 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి వేదికగా నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను శాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులతో కలిసి శనివారం పరిశీలించా రు. స్పోర్ట్స్ నిర్వహించనున్న అన్ని క్రీడా మైదానాలు, క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. క్రీడా పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు, సిబ్బంది సమన్వయంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లలో ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ , డి.ఈ మధు , శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, శాప్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.