మెగాస్టార్ చిరంజీవి అభిమానులు 71 వా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
*ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు* ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండల ప్రతినిధి ఆగస్టు 22. రాజుపాలెం . పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామంలో శనివారం ఘనంగా జరిగాయి. సర్పంచ్ పులిబండ్ల అశోక్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చీ భారీ కేకును కోసి చిన్నారులకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పగడాల శ్రీనివాసరావు, సఖినాల ధర్మారావు, కేదారి రమేష్, చిట్టెంశెట్టి గోపి, చంద్రశేఖర్ నాయక్, చొక్కా మల్లికార్జున రావు, పెమ్మా చిన చెన్నయ్య, వసంతపు చిన వెంకటేశ్వర్లు, పులిబండ్ల అంకమ్మరావు, సమారి సైదారావు, ఆకుల కోటేశ్వరరావు, మొర్రిబోయిన రామాంజనేయులు, కాంట్రగుంట వెంకటేశ్వర్లు, పోతంశెట్టి వెంకట్రామయ్య, గుబిలి కోటేశ్వరరావు వందలాది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:











