Wednesday, 8 July 2026
  • Home  
  • మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్
- జనగాం

మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 07-07-2026 రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి నిందితుడు చీపురి రాహుల్ (22), తండ్రి: యాకస్వామి, నివాసం: బొమ్మెర గ్రామం, పాలకుర్తి మండలంను పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేసి, నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. దర్యాప్తులో భాగంగా, 07-07-2026 సాయంత్రం సుమారు 7:15 గంటలకు పాలకుర్తి మండలంలోని గుడివాడ చౌరస్తా వద్ద నిందితుడు TS/TG-08-AR-1911 నంబర్ గల ఇన్నోవా కారును మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి స్ప్లెండర్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెంతల వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుండి ఆగకుండా పరారైన నిందితుడు, అదే కారుతో కొద్ది సేపటికే గూడూరు గ్రామం వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వడ్లకొండ రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో ప్రమాదం అనంతరం కూడా నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా, స్థానిక గ్రామస్తులు వెంటాడి బొమ్మెర గ్రామ సమీపంలో పట్టుకుని పాలకుర్తి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో నిందితుడు మద్యం సేవించినట్లు గుర్తించారు. పాలకుర్తి సీఐ జానకి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.

పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 07-07-2026 రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి నిందితుడు చీపురి రాహుల్ (22), తండ్రి: యాకస్వామి, నివాసం: బొమ్మెర గ్రామం, పాలకుర్తి మండలంను పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేసి, నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
దర్యాప్తులో భాగంగా, 07-07-2026 సాయంత్రం సుమారు 7:15 గంటలకు పాలకుర్తి మండలంలోని గుడివాడ చౌరస్తా వద్ద నిందితుడు TS/TG-08-AR-1911 నంబర్ గల ఇన్నోవా కారును మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి స్ప్లెండర్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెంతల వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుండి ఆగకుండా పరారైన నిందితుడు, అదే కారుతో కొద్ది సేపటికే గూడూరు గ్రామం వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వడ్లకొండ రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండో ప్రమాదం అనంతరం కూడా నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా, స్థానిక గ్రామస్తులు వెంటాడి బొమ్మెర గ్రామ సమీపంలో పట్టుకుని పాలకుర్తి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో నిందితుడు మద్యం సేవించినట్లు గుర్తించారు.
పాలకుర్తి సీఐ జానకి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.