పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో ఓటర్ల క్రమబద్ధీకరణ కోసం నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ఫారాల నింపే ప్రక్రియలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగులపల్లి గ్రామపంచా 03వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగులపల్లి గ్రామంలో చాలామంది ప్రజలకు ఈ ఫారాలను ఎలా నింపాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ఇదే సమయంలో వివరాల సేకరణ కోసం వస్తున్న బీఎల్ఓ లపై కూడా పని ఒత్తిడి, ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున స్థానిక తహసిల్దార్ తక్షణమే స్పందించి, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు నాగులపల్లి గ్రామంలో ఒక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఓటర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా ముగుస్తుందని ఆయన సూచించారు.





















