శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బెరివారి మండపం కూడలి వద్ద బీజేపీ నేత కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక మధు హోటల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన మాధవ్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెరివారి మండపానికి చేరుకున్న ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశాభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనపై విమర్శలు చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆరోపించారు. కోలా ఆనంద్ ప్రజల మధ్య ఎప్పటికప్పుడు ఉండే నిబద్ధత గల నాయకుడని కొనియాడిన మాధవ్, అనంతరం నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముందు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదం పొందారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “భారత్ మాతా కీ జై”, “జై శ్రీరామ్” నినాదాలతో శ్రీకాళహస్తి వీధులు మారుమోగాయి.

శ్రీకాళహస్తిలో ఘనంగా బీజేపీ విజయోత్సవాలు