Monday, 4 May 2026
  • Home  
  • యోగా సాధనతో ఆరోగ్యానికి మేలు-డా. దశరథాచారి
- తిరుపతి

యోగా సాధనతో ఆరోగ్యానికి మేలు-డా. దశరథాచారి

శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడిపూడి దశరథాచారి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సాలిపేట భావన ఋషి కళ్యాణ మండపంలో యోగా గురువు భారతీనాటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా శిబిరంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….యోగా సాధన వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉండటమే కాకుండా, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. గత మూడు దశాబ్దాలుగా శిక్షణ అందిస్తున్న అనుభవజ్ఞుడైన భారతీనాటర్ వద్ద యోగా నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. బహదూర్‌పేట, కొత్తపేట, సాలిపేట ప్రాంతాల ప్రజలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు నిర్వహించే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మునీంద్రయ్య, రుక్కు, మోహనాచారి, ముని లక్ష్మి, మహేశ్వరి, విజయలక్ష్మి, సుజాత, గీత తదితరులు పాల్గొన్నారు. వివరాల కోసం 98490 80596 నంబరును సంప్రదించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.