రాజమహేంద్రవరం, ఆగస్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, IPSను నల్లమిల్లి మనోజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా పాల్గొన్నారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.


