Tuesday, 8 September 2026
  • Home  
  • మెగా పీటీఎం 3.1కు తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలి: ఎంఈఓ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా పీటీఎం 3.1కు తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలి: ఎంఈఓ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 23 (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పీటీఎం 3.1 కార్యక్రమం గురువారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుందని ఎంఈఓ నరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, టెస్ట్ పుస్తకాలు అందజేస్తోందని, మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులతో చర్చించి వారి పురోగతికి సహకరించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 23 (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పీటీఎం 3.1 కార్యక్రమం గురువారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుందని ఎంఈఓ నరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, టెస్ట్ పుస్తకాలు అందజేస్తోందని, మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులతో చర్చించి వారి పురోగతికి సహకరించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

1 Comment

  1. viman

    July 23, 2026

    కడప జిల్లా
    పులివెందుల
    కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను ప్రకాష్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. లీకేజీలకు బాధ్యులెవ్వరైనా శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.నిరసనల పేరుతో మహిళా జర్నలిస్టుపై అసభ్యంగా ప్రవర్తించడం ఖండనీయమని, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను ప్రజలంతా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు వాజ్‌పాయి, పట్టణ అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.