బెల్లంపల్లి మున్సిపాలిటీ 22వ వార్డ్ కౌన్సిలర్ పీక ఎల్లా బాయి ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి వార్డ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వార్డ్ పర్యటనలో భాగంగా వర్షాకాలం దృష్ట్యా వార్డ్ ప్రజలకు పారిశుధ్య ఇబ్బంది కలగకుండా, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జేసీబీ సహాయంతో వార్డ్ లో పూడుకుపోయిన ప్రధాన కాలువలను శుభ్రం చేయించడం జరిగింది.అదేవిదంగా వార్డ్ లో గత కొన్నేళ్లుగా మంచినీటి(మిషన్ భగీరథ) పైప్ లైన్ లేకపోవడంతో మంచినీటి కోసం వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన కౌన్సిలర్ పీక ఎల్లాబాయ్, వార్డ్ ప్రజల నీటి ఎద్దడి సమస్య పరిష్కరించేందుకు గాను వార్డులో నూతన పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది.ఎన్నో ఏళ్లుగా నెలకొని ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 34వ వార్డ్ కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి , కాంగ్రెస్ నాయకులు నీలి కృష్ణ, కంకటి శ్రీను, పీక లక్ష్మణ్, పులి సురేష్, కుమ్మరి శంకర్, దామోదర్, బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు




