శ్రీ కాళహస్తి, జులై 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని యార్లపూడి, మేళ్లచెరువు, గుండ్లపల్లి, కలవగుంట, ఎల్లంపల్లి గ్రామాల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనపై ఆదివారం ప్రత్యేక అవగాహన సదస్సులు జరిగాయి. సిడిపిఓ శాంతి దుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుల్లో మహిళలు, యుక్త వయసు బాలికలు, గ్రామస్తులకు సైబర్ సెక్యూరిటీ, పిల్లల రక్షణ, డిజిటల్ అక్షరాస్యత వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాంతి దుర్గ మాట్లాడుతూ.. పిల్లల హక్కులను రక్షిస్తూ వారిని మంచి వాతావరణంలో పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలికలకు, పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చిన్న పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయవద్దని, ఫోన్ స్క్రీన్ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలని తల్లులకు కోరారు. ప్రభుత్వం అందిస్తున్న మాతృత్వ వందన యోజన పథకాలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో సూపర్వైజర్ ప్రియాంక, అంగన్వాడి కార్యకర్తలు, ప్రగతి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామీణ మహిళలకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీపై అవగాహన