శ్రీ కాళహస్తి, జులై 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఎ. గంగాదేవి అనే పేద మహిళ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ నిమిత్తం సదరు నిరుపేద కుటుంబం అప్పులపాలై, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.వి. అమర్ నాథ్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగాదేవి కుటుంబ ఆర్థిక పరిస్థితిని, వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా సదరు కుటుంబానికి గరిష్ట ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపి ఆదుకోవాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సిఎంఆర్ఎఫ్ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

గుండె ఆపరేషన్ చేయించుకున్న పేద మహిళకు సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి