పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీని ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాటసింగారం బ్యాంకు చైర్మన్, మాజీ సర్పంచ్, పెద్ద అంబర్‌పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ, సురేందర్ యాదవ్ హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కాఫీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు గ్యార వీరస్వామి, చెంచల నాగరాజు, పురం శేఖర్ రెడ్డి, మునుకుంట్ల శేఖర్ గౌడ్, గ్యార బాల నరసింహ, శెట్టి గారి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ గౌరెల్లి ప్రాంతంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాఫీ, టీ ప్రియులకు రుచికరమైన, నాణ్యమైన పానీయాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా మద్రాస్ ఫిల్టర్ కాఫీకి మంచి పేరు, ప్రఖ్యాతి ఉందని, అదే నాణ్యతతో గౌరెల్లి ప్రాంత ప్రజలకు ఫిల్టర్ కాఫీని అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



