Friday, 4 September 2026
  • Home  
  • _కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన “కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం”…_*
- మేడ్చల్ – మల్కాజిగిరి

_కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన “కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం”…_*

కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై వారం రోజులపాటు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ, జీవో 59 ఇళ్ల క్రమబద్ధీకరణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతిపత్రం…. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై సమర శంఖం పూరించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గార్ల ఆధ్వర్యంలో ఈనెల 7 రోజుల పాటు నిర్వహించనున్న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి రెవెన్యూ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిన ఘనత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. 🏣 కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమ అనుయాయులకు, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అనర్హులకు కేటాయిస్తుందన్నారు. కాబట్టి రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ అవినీతి పాలనపై నిష్పక్ష విచారణ చేపట్టి దళారులుగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. *పెండింగ్ లో ఉన్న జీవో 59* దరఖాస్తులను వెంటనే పూర్తిచేసి పేద ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించాలి. *ఇందిరమ్మ పథకం* క్రింద అర్హులకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి దరఖాస్తుదారుడు నుంచి పదివేల రూపాయలు కట్టించుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం కుత్బుల్లాపూర్ లో ఎక్కడ ప్రభుత్వ భూమి కేటాయించారు, ఏ విధమైన నిర్మాణాలు చేపడుతున్నారు, ఎప్పటి లోగా ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తారనే దానిపై దరఖాస్తుదారులకు, నిరుపేదలకు స్పష్టత ఇవ్వాలన్నారు. *ఇందిరమ్మ ఇండ్ల పేరుతో* ప్రభుత్వం మరో మారు నిరుపేదలను మోసం చేస్తుండగా కొందరు దళారులు మాత్రం ఇదే అదునుగా భావిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనంతరం అర్హులకు అందాల్సిన *డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు* లో జరుగుతున్న అవినీతి, *జీవో 59 క్రమబద్ధీకరణ* వంటి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దళారులపై పడిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం

కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై వారం రోజులపాటు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ, జీవో 59 ఇళ్ల క్రమబద్ధీకరణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతిపత్రం….

కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై సమర శంఖం పూరించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గార్ల ఆధ్వర్యంలో ఈనెల 7 రోజుల పాటు నిర్వహించనున్న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి రెవెన్యూ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిన ఘనత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.

🏣 కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమ అనుయాయులకు, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అనర్హులకు కేటాయిస్తుందన్నారు. కాబట్టి రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ అవినీతి పాలనపై నిష్పక్ష విచారణ చేపట్టి దళారులుగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

*పెండింగ్ లో ఉన్న జీవో 59* దరఖాస్తులను వెంటనే పూర్తిచేసి పేద ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించాలి.

*ఇందిరమ్మ పథకం* క్రింద అర్హులకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి దరఖాస్తుదారుడు నుంచి పదివేల రూపాయలు కట్టించుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం కుత్బుల్లాపూర్ లో ఎక్కడ ప్రభుత్వ భూమి కేటాయించారు, ఏ విధమైన నిర్మాణాలు చేపడుతున్నారు, ఎప్పటి లోగా ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తారనే దానిపై దరఖాస్తుదారులకు, నిరుపేదలకు స్పష్టత ఇవ్వాలన్నారు.

*ఇందిరమ్మ ఇండ్ల పేరుతో* ప్రభుత్వం మరో మారు నిరుపేదలను మోసం చేస్తుండగా కొందరు దళారులు మాత్రం ఇదే అదునుగా భావిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అనంతరం అర్హులకు అందాల్సిన *డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు* లో జరుగుతున్న అవినీతి, *జీవో 59 క్రమబద్ధీకరణ* వంటి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దళారులపై పడిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.