తల్లపనేని చిన్న వెంకటేశ్వర్లు మృతి బాధాకరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Date :25-9-2026 నందిపాడు (పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు మండలం నందిపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తలపనేని చిన్న వెంకటేశ్వర్లు మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నందిపాడులోని ఆయన స్వగృహానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ,మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్ర బాబు. మన్నేటి వెంకటరెడ్డి, మరియు మండలం టీడీపీ నాయకులు పాల్గొని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ బలోపేతానికి చిన్న వెంకటేశ్వర్లు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి పార్టీకి, నందిపాడు గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.











