Tuesday, 22 September 2026

Tag: politics

నారాయణపేట

తెలంగాణకు ఇచ్చిందిలే.. తెచ్చిందిలే.. సచ్చిందిలే.. అబద్ధాల గురువు నరేంద్ర మోదీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేస్తున్న విమర్శలను మండల కాంగ్రెస్ నాయకుడు నల్లే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ కుట్రపూరితంగా విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీజేపీ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులు అన్నారు

అన్నమయ్య

కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

నందలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నందలూరు బస్టాండ్ ఆవరణలో జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి అభిమానులు, జనసైనికులు సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కొట్టే శ్రీహరి ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రావుల శేషగిరి

తేదీ 30/8/26 ఆదివారం ఉదయం 10 గంటలకు కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో ఉషోదయ టవర్ పక్కన మన బిజెపి పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గా గిరివర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకారం మరియు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమము లొ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఇట్లు , మీ రావుల శేషగిరి ex కార్పొరేటర్ బిజెపి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్

నిర్మల్

Congress party leader Mr. Mohsin khan urges voters not to fear from SIR.

In bhainsa, BLo’s are started issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, age discrepancy , six or more siblings, siblings age less than 9months and so on. On behalf of Congress party Mr. Mohsin Khan request the people of Mudhole constituency to contact us for any kind of legal guidance and support. And he advised the voters that don’t fear from SIR instead face the SIR. We are available 24/7 at your service. Contact: 9908428746.

నిర్మల్

Congress party leader Mr. Mohsin khan urges voters not to fear from SIR.

In bhainsa, BLo’s are started issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, age discrepancy , six or more siblings, siblings age less than 9months and so on. On behalf of Congress party Mr. Mohsin Khan request the people of Mudhole constituency to contact us for any kind of legal guidance and support. And he advised the voters that don’t fear from SIR instead face the SIR. We are available 24/7 at your service. Contact: 9908428746.

నిర్మల్

SIR notices issued in bhainsa

In bhainsa, BLo’s are started issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, and so on.

మేడ్చల్ – మల్కాజిగిరి

మహాదేవపురంలో రూ.1 కోటి 20 లక్షల తో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 277వ డివిజన్ మహాదేవపురం పరిధిలోని కైసర్ నగర్‌లో సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1 కోటి 20 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. కైసర్ నగర్‌లోని శివాలయం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహాదేవపురం కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి కాలనీ వాసులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, ఫరీన్‌ఖాన్ -మల్కాజ్‌గిరి ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, మైనారిటీ నాయకులు షఫీ, సుల్తాన్ మీర్జా, దేవేందర్ నగర్ అధ్యక్షులు అపజల్ భాయ్, వాలి భాయ్, ఫారూఖ్ ఖాన్, అజీమ్ భాయ్, మునావర్ భాయ్, ఝాఫర్, ఇమ్రాన్, అసిఫ్, మహేందర్, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు, కాలనీ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరం : సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ హేమ సమల

అనారోగ్యం బాధపడుతున్న అడ్డగుట్టకు చెందిన గడిపాక రాములు, వారసిగూడకు చెందిన శ్రీశైలం గార్లకు వారి వైద్య చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు పత్రాలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారితో కలిసి అందజేయడం జరిగింది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సీతాఫలమండి లోని డా. బి.ఆర్. అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారితో కలిసి పరిశీలించడం జరిగింది. విగ్రహాల చుట్టూ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు… సమాజంలో ప్రతి ఒక్కరు కుల మతాలకతీతంగా మతసామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు,ముస్లిం మైనార్టీ మత పెద్దలతో పాటు స్థానిక నాయకులు జహంగీర్, సలీం, రషీద్, షాకీర్ తదితరులతో పాటు ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు..

మేడ్చల్ – మల్కాజిగిరి

WUDVEXA ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు నిక్కంటి వెంకటకృష్ణ, నిక్కంటి వెంకటరాయుడు, నిక్కంటి వీర రాఘవులు నూతనంగా ఏర్పాటు చేసిన WUDVEXA Plywood, Laminates, Hardware & Interiors షాప్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, బాచుపల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన Plywood, Laminates, Hardware & Interior Products అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి, మంచి పేరు సంపాదించాలని షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నవీన్, విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.