संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: politics

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జనసేన పార్టీకి మైనార్టీ వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. కావలి పట్టణ జనసేన నాయకులు సయ్యద్ సాజిద్, షేక్ రిహానా, విజయానంద్ లా ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా ముస్లిం మైనార్టీ మహిళలు, యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు పార్టీలో చేరిన మహిళలకు, యువతకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ​ఈ సందర్భంగా శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ: “జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, సమాజంలో మార్పు కోసం ఆయన పడుతున్న తపన చూసి అన్ని వర్గాల ప్రజలు పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. ​కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ సాజిద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై నమ్మకంతోనే మైనార్టీ మహిళలు, యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరారని, రాబోయే రోజుల్లో కావలి పట్టణంలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నాగేంద్ర పార్థవదేహానికి నివాళులర్పించిన జనసేన నాయకులు మన్నెమాల సుకుమా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి అల్లు అర్జున్ అభిమానుల సంఘం అధ్యక్షుడు కూరపాటి నాగేంద్ర బాబు తీవ్ర అనారోగ్యంతో నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో చేరారు.శనివారం నాగేంద్ర స్వర్గస్తులయ్యారని విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు శనివారం రాత్రి నాగేంద్ర నివాసానికి చేరుకుని నాగేంద్ర పార్థవదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మృతి చెందడం అత్యంత బాధాకరమని సుకుమార్ రెడ్డి గారు కన్నీటి నివాళులర్పించారు. నాగేంద్ర కుటుంబ సభ్యులకు సుకుమార్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగేంద్ర కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం నింపాలని కోరుకున్నారు. నాగేంద్ర కుటుంబానికి అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలుపాడులో ఘనంగా ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం

రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం దగదర్తి: మండలంలోని మనుబోలుపాడు గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 20 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండల టీడీపీ ఇన్‌చార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు గ్రామస్తులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదినారాయణపురంలో ఘనంగా నూతన కాపుల పట్టాభిషేకం

అల్లూరు, అక్టోబర్ 10: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఆదినారాయణపురం గ్రామంలో నూతన కాపుల పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాపులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. గ్రామ సంప్రదాయాలను కాపాడుతూ, ఐక్యత, పరస్పర సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయడంలో కాపుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కాపులు వీరే! పెద్దకాపు: బుచ్చంగారి నరసయ్య నడికాపు: ఊటుకూరు నరసయ్య చిన్నకాపు: కోడూరు సోమయ్య క్యాషియర్: కొండూరు కసుమూర్ నూతనంగా ఎన్నికైన ఈ నలుగురు తమ బాధ్యతలను స్వీకరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులకు ఘన సన్మానం ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులను నూతనంగా ఎన్నికైన కాపులు శాలువాలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పట్టాభిషేక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతనంగా ఎన్నికైన కాపులకు పలువురు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ఐక్యతను కాపాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

మహబూబాబాద్

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులే టార్గెట్ నోటీసులు ఇవ్వకుండానే దౌర్జన్యం

మరిపెడ మున్సిపాలిటీ అధికారుల పనితీరు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరావు ఇంటిని టార్గెట్ చేసిన మున్సిపాలిటీ అధికారులు, నోటీసులు ఇవ్వకుండా జెసిపి సహాయంతో కూల్చడానికి వచ్చిన అధికారులు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇంటి ప్రహరీ గోడను ఎలా కూలగొడుతారని మున్సిపాలిటీ అధికారులతో వాగ్వాదం, రెండు వైపులా న్యాయబద్ధంగా పనులు చేయించండి బిఆర్ఎస్ పార్టీ నాయకులమనే కక్షతో కూల్చితే ఊరుకునేది లేదు… Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మన్నెమాల సుకుమార్‌రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన దగదర్తి మండల జనసేన శ్రేణులు

కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డిని దగదర్తి మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ​దగదర్తి మండల మాజీ కన్వీనర్ తాళ్లూరి వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది ముఖ్య నాయకులు మరియు క్రియాశీలక కార్యకర్తలు కావలిలోని మన్నెమాల సుకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం తొలిసారి ఆయన్ను కలిసిన నాయకులు, ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా తాళ్లూరి వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, సీనియర్ నాయకులు సుకుమార్‌రెడ్డి పార్టీలోకి రావడం నియోజకవర్గంలో జనసేన శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, దగదర్తి మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ​అనంతరం మన్నెమాల సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ గారి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో కలిసి వచ్చిన దగదర్తి మండల నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండలానికి చెందిన పలువురు జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

అసలు ఈ నేహా బోరా ఎవరు?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేహా బోరా ఎవరు? ఆమె విద్యార్థి రాజకీయ ప్రయాణం ఎందుకు అంత ప్రత్యేకం? 29 ఏళ్ల నేహా బోరా ఉత్తరాఖండ్‌కు చెందిన యువ విద్యార్థి నాయకురాలు. ఆమె తండ్రి భారతీయ సైన్యంలో అత్యున్నత హోదాలో (ఆర్మీలో ఉన్నత అధికారిగా) దేశానికి సేవ చేసిన వ్యక్తి. మిలిటరీ నేపథ్యం, నుంచి వచ్చినప్పటికీ సమాజంలోని అసమానతలను, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించే దృక్పథాన్ని నేహా ఎంచుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన నేహా , ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ విభాగంలో PhD రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్నారు. విద్యార్థి దశలోనే థియేటర్ ద్వారా సామాజిక సమస్యలపై గళం ఎత్తిన ఆమెకు, ఒక పొలిటికల్ థియేటర్ గ్రూప్ ద్వారా వామపక్ష AISAతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, 2019లో CAA వ్యతిరేక ఉద్యమాల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. దేశాన్ని కుదిపేస్తున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత లోపాలు, తీవ్రమైన నిరుద్యోగం మరియు విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. జంతర్ మంతర్ వద్ద ఏకంగా 23 రోజుల పాటు అసాధారణమైన నిరాహార దీక్ష చేపట్టడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. నిన్న ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం జరిగిన నిరసనలో ఆమెను బలవంతంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆమె చూపిన అసాధారణ తెగింపు, పోరాట పటిమ ముందు పోలీసుల బలప్రయోగం తేలిపోయింది; ఆ ధైర్యం చూసి చివరకు పోలీసులే వెనకడుగు వేయాల్సి వచ్చింది. యువత గొంతు నొక్కాలని, ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా… నేహా బోరాను అడ్డుకోవడం ఆ పార్టీ వల్ల కాలేదు. ఆమె సంకల్పం ముందు పాలకవర్గాల బెదిరింపులు పూర్తిగా బలాదూర్ అయ్యాయి. అధికార బలంతో ఎవరినైనా అణచివేయవచ్చనే అహంకారానికి, భయపడని ఒక యువత స్వరం ఎలా ఎదురునిలుస్తుందో నేహా బోరా నిరూపించారు. థియేటర్ వేదిక నుంచి విద్యార్థి ఉద్యమ రణరంగం వరకు ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం—నియంతత్వ పోకడలను ధైర్యంగా ఎదిరించే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప స్ఫూర్తిదాయక గాథ.

తూర్పు గోదావరి

గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలుపోషణ అభియాన్ పథక లక్ష్యం…తూర్పు గోదావరి జిల్లా బి.జె.పి అధ్యక్షులు.పిక్కి నాగేంద్ర,

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోషకాహార స్థాయిని మెరుగుపరచడం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ పథక లక్ష్యం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా నిరంతరం ఉన్నతమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ ను ఆయాలను సత్కరించాలని. నరేంద్ర మోదీ ఆదేశాలమేరకు కొవ్వూరు పట్టణంలో కూడా అంగన్వాడి కేంద్రాలలో సేవలందిస్తున్న టీచర్స్ ఆయాలకు బిజెపి ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ.. కటిక పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ పేదల కష్టాలు తెలిసి పేదల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అందులో పోషణ అభియాన్ కార్యక్రమం అత్యంత ప్రధానమైనది. దేశంలోని తల్లులు, చిన్నారులకు పోషక ఆహార లోపం ఉండకూడదని.. ఆరోగ్యకరమైన తల్లులు పిల్లలు ఉంటేనే ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించవచ్చు అని పోషణ అభియాన్ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. పోషక ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పిల్లలకు అందిస్తున్నారు. పిల్లల వయస్సు 6 సంవత్సరాలు వచ్చేఅంతవరకు అనగా నర్సరీ, ఎల్.కె.జి, యూ.కె.జి చదువును అంగన్వాడీ కేంద్రాలలో అందుతుంది, ప్రజలు ఉపయోగించుకోవాలి. అంగన్వాడి సిబ్బంది సేవలకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని పిక్కి నాగేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉదయ భాను కళావతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, తాడిమళ్ళ విజయవాణి, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, మహిళా మోర్చా అధ్యక్షులు దార్లంక పద్మావతి, నాయకులు తురగా విజయభాస్కర్, నేమాని వెంకట బాలరాణి.. తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కొవ్వూరులో వై.సి.పి కి భారీషాక్…టీడీపీలోకి భారీ చేరికలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం నుంచి సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ద్విసభ్య కమిటీ నాయకుల కంట మని రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.కొవ్వూరు మున్సిపాలిటీలోని 28 వార్డులకు 28 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని నాయకులు సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ వార్డు స్థాయిలో కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.

ప్రకాశం

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు ధన్యవాదాలు తెలిపిన దారపనేని, చెనికల

-తూర్పు కోడిగుడ్లపాడు రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు -శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం -ఎమ్మెల్యే చొరవతో గ్రామ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం పామూరు, అక్టోబర్ 3(పున్నమి ప్రతినిధి): పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన అనంతరం పనులను ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పోతవరం టీడీపీ నాయకులు చెనికల చిన్న మాలకొండయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన వెంటనే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న కృషికి తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను వెంటనే ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి కానుకగా అందిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు టీడీపీ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, జంగాలపల్లి టీడీపీ నాయకులు మానం మల్లికార్జున యాదవ్, పోతవరం టీడీపీ నాయకులు మిరియం సుబ్బరాయుడు, మిరియం గురువయ్య, గడిపూటి వెంకటేశ్వరరావు, తిరివీధి చంద్ర, తిరివీధి హజరత్ తదితరులు పాల్గొన్నారు.