संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

భైంసాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భైంసాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

खबर की मुख्य बातें

  • భైంసా పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం విశేషమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

భైంసా పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం విశేషమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి, స్థానిక నాయకులు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *