Tuesday, 22 September 2026

Tag: politics

మేడ్చల్ – మల్కాజిగిరి

శాంతి, సహనం, పరస్పర గౌరవం, పేదల పట్ల దయ, మానవ సేవ భావాలను చాటేదే మిలాద్ ఉన్ నబీ పండుగ : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దుమ్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించగా ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. ప్రవక్త మహమ్మద్‌ (స) బోధించిన శాంతి, సహనం, పరస్పర గౌరవం, పేదల పట్ల దయ, మానవ సేవ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా జగద్గిరిగుట్ట డివిజన్‌లోని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. “ప్రేమ, శాంతి, కరుణ – ప్రవక్త మహమ్మద్‌ (స) చూపిన మానవతా మార్గం” అనే సందేశంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వరా దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు ఎండి. ఆజం, సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్, పాషా, ఖయ్యుమ్, మహమ్మద్ మెహెమూడ్, మహమ్మద్ అన్వర్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ సోహెల్, ఎస్.కె. జావీద్, మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ అక్బర్, సయ్యద్ జలీల్, సురేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

“ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!”

అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి: తన్నీరు హరీష్ రావు… 22-A బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 22-A బాధితుల సమస్యలపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హరీష్ , ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు , గోరేటి వెంకన్న , ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ…. “తెలంగాణలో 22-A సమస్య కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదు.. వేలాది మంది భూ యజమానుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య” అని అన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, చట్టబద్ధమైన పత్రాలు, పట్టాలు కలిగి ఉండి, పన్నులు చెల్లిస్తున్న ప్రజల భూములను ఒక్కసారిగా 22-A జాబితాలో చేర్చడం వల్ల వారు తమ భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “22-A అంటే కేవలం ఒక నంబర్ కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తుపై పడే తాళం!” ఒక కుటుంబం తన భూమిని అమ్మి పిల్లల చదువుకు ఖర్చు చేయవచ్చు, కూతురి వివాహం చేయవచ్చు, వ్యాపారం ప్రారంభించవచ్చు, అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించవచ్చు, ఇల్లు నిర్మించుకోవచ్చని హరీష్ రావు పేర్కొన్నారు. “ప్రజల భూములను నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 22-A అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. “భూభారతి సాక్షిగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. 2023 డిసెంబర్ నుంచి 22-A జాబితాలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్లపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి” అని ఆయన అన్నారు. తప్పు చేయలేదని ప్రభుత్వం చెబుతున్నట్లయితే, సంబంధిత శాఖ బాధ్యత వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి .. మీ తప్పు లేకపోతే వెంటనే పొంగులేటిని బర్తరఫ్ చేయండి అని హరీష్ రావు సవాల్ చేశారు. మీకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే.. మాకు పోరాటాలు తెలుసు… ప్రజల పక్షాన ఎలా పోరాడాలో మాకు తెలుసు అని హరీష్ రావు స్పష్టం చేశారు. 22-A బాధితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 7వ తేదీలోగా లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తాం. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయి. ప్రజలకు కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని హరీష్ రావు అన్నారు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యులను గుర్తించి శిక్షిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. “ప్రజల భూములపై కన్నేస్తే సహించేది లేదు..ప్రజల హక్కులను హరిస్తే పోరాటం ఆపేది లేదు!” ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌ పలు ఆలయ కమిటీల సభ్యులు, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వివిధ ఆలయ కమిటీ సభ్యులు తమ కుటుంబాల్లో నిర్వహించనున్న వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యేకు అందజేసి, కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యలను శ్రీ కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సావధానంగా విన్న ఆయన, సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

పాపిరెడ్డి నగర్ లో 90 గజాల్లో 5 అంతస్తుల అక్రమ నిర్మాణం

జగద్గిరిగుట్ట:కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ రోడ్ నెం.6 లో 90 గజాల స్థలంలో అనుమతులు లేకుండా 5 అంతస్తుల భవన నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం 100 గజాల లోపు స్థలంలో G+2 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా కచ్చితంగా సెట్ బ్యాక్ వదలాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా పక్క ఇళ్లకు ఆనుకుని నిర్మాణం చేపట్టారు. దీంతో పక్క ఇళ్లకు గాలి, వెలుతురు లేకపోవడం, పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగితే పెద్ద ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

పరమశివుని సన్నిధికి భక్తిశ్రద్ధలతో కావడి యాత్ర

పరమశివుని సన్నిధికి భక్తిశ్రద్ధలతో కావడి యాత్ర కుత్బుల్లాపూర్, సూరారం:129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ (షాపూర్ నగర్) నుండి సూరారం శివాలయం వరకు పవిత్ర కావడి యాత్ర ఆదివారం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. సంగీత పాత్ర ఆధ్వర్యంలో ఈ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి పాల్గొని సూరారం శివాలయంలో పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యు.ఎన్.ఆర్ సురేష్ గౌడ్, నాగరాజు, సైదులు, రాజేష్, నవీన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

తరతరాల అనుబంధం– ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం

తరతరాల అనుబంధం – ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంట వివాహ వేడుకలు స్వయంగా విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 22.( పున్నమి ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి, నారా కుటుంబాలతో కోళ్ల కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. పార్టీ స్థాపన నాటి నుండి దివంగత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు చూపిన నిబద్ధత, అందించిన సేవలు పార్టీ చరిత్రలో చిరస్మరణీయం. ఆనాటి నుండి మొదలైన ఈ ఆత్మీయ బంధం తరాలు మారుతున్నా మరింత పటిష్టంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి, కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ల కుమార్తె చి.ల.సౌ. కోళ్ల అస్మితానాయుడు, వరుడు చి. చప్ప ఎర్ని పవన్ మౌళిల వివాహం ఈ నెల 27న వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్.కోటలోని ఎమ్మెల్యే స్వగృహానికి స్వయంగా విచ్చేశారు. ఆత్మీయ పలకరింపులు – ఆశీర్వచనాల వర్షం ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాబోయే నూతన వధూవరులను ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ కోళ్ల అప్పలనాయుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో ఆ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం కోళ్ల అప్పలనాయుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ముఖ్యమంత్రి చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగారు. అధినేత స్వయంగా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం పట్ల ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కర్నూలు

ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్

నందవరం: మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న 45 రోజుల “ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా నందవరం మండలం పెద్ద కొత్తలి గ్రామంలోని బూత్ నం.05, క్లస్టర్–1 పరిధిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం–2, అన్న క్యాంటీన్లు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి–ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను గ్రామస్తులకు వివరించారు. “ఇంటింటా తెలుగుదేశం” కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. “ప్రతి ఇంటికి సంక్షేమం – ప్రతి కుటుంబానికి అభివృద్ధి – ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం” అనే లక్ష్యంతో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది.

మేడ్చల్ – మల్కాజిగిరి

_డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయిల్స్ 2026 కు ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారికి ఆహ్వానం_*

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ సభ్యులు ఈనెల 23 అనగా ఆదివారం కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ స్టూడియో లో నిర్వహించనున్న డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయల్స్ – 2026 క్రీడా పోటీలకు ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు మాట్లాడుతూ… ✊ డబ్ల్యూ పిసి పోటీల ద్వారా అత్యుత్తమ లిఫ్టర్లను ఎంపిక చేసి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ డబ్ల్యూపిసి తెలంగాణ తరఫున జాతీయస్థాయిల నిర్వహించే ఛాంపియన్షిప్ పాల్గొని తమ సత్తాను చాటుకునేందుకు క్రీడాకారులకు మంచి అవకాశం ఈ పోటీల ద్వారా లభిస్తుందన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొని క్రీడాకారులు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్ కిరణ్, వర్ష, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

🚩🏗️ 292 సాయిబాబా నగర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం 🏗️🚩

292 సాయిబాబా నగర్ డివిజన్‌లో మన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. ✊🇮🇳🎉 🔹🏛️ సాయి గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ – ₹19.50 లక్షలు ➡️ 🚩 శంకుస్థాపన 🔹🏗️ కృషి కాలనీ కమ్యూనిటీ హాల్ – ₹12 లక్షలు ➡️ 🔨 స్లాబ్ వేసి నిలిచిపోయిన పనుల పునఃప్రారంభం 🔹🛣️ సూరారం మార్కెట్ రోడ్ జై భవాని కమ్యూనిటీ హాల్ – ₹12 లక్షలు ➡️ 🚩 అభివృద్ధి పనుల ప్రారంభం 🔹🏛️ మైత్రి నగర్ కమ్యూనిటీ హాల్ – ₹12 లక్షలు ➡️ 🚩 అభివృద్ధి పనుల ప్రారంభం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీ మన్నె రాజు గారు 🐟🏛️, డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు, బల్లెం శ్యామ్ గారు ✊, డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ యాసిన్ గారు 🤝, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారెడ్డి గారు, సత్తిరెడ్డి గారు, రామచందర్ గారు, హరి నాయుడు గారు పాల్గొన్నారు. 🙏 🌹 కాంగ్రెస్ సీనియర్ నాయకురాళ్లు శైలజ గారు, వరలక్ష్మి గారు, కుమారి గారు పాల్గొన్నారు. ✊🇮🇳 🤝 కృషి కాలనీ నాయకులు గణపతి రావు గారు, తిరుపతి రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, ప్రవీణ్ గారు, కొండల్ గారు పాల్గొన్నారు. 🏛️ సాయి గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతయ్య స్వామి గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, కోశాధికారి వీరారెడ్డి గారు పాల్గొన్నారు. 🙏 🤝 పుష్పగిరి బస్తీ ప్రెసిడెంట్ వెంక రెడ్డి గారు, హరి గారు, కృష్ణంరాజు గారు పాల్గొన్నారు. 🌺 జై దుర్గ భవాని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెంకటస్వామి గారు, శ్రీను గారు, సత్యనారాయణ గారు, యాదగిరి గారు, శివ గారు పాల్గొన్నారు. 🙏 🏘️ మైత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు అశోక్ గారు, కుమార్ గారు, బాలస్వామి గారు, రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు. 🤝 💪 కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 🇮🇳✊ 🙏 ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్న హనుమంత్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🌹 ❤️ ప్రజల కోసం… అభివృద్ధి కోసం… ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్! ✊🇮🇳 🚩 జై కాంగ్రెస్! 🚩 జై హనుమంత్ రెడ్డి అన్నా! 🔥✊

కర్నూలు

కొండాపురి ఇషాక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బీవీ, శేఖరన్న

ఎమ్మిగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు కొండాపురి ఇషాక్ గారి సోదరుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు శేఖరన్న గారితో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతికి సంతాపం తెలిపారు. బాధలో ఉన్న కుటుంబానికి తాము అండగా ఉంటామని, పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి గారు, శేఖరన్న గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.