Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు: కలెక్టర్ జి. రాజకుమారి గనియా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు: కలెక్టర్ జి. రాజకుమారి గనియా

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల:ప్రజా పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి అధికారులను ఆదేశించారు.
  • సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ...

నంద్యాల:ప్రజా పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 4,543 పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటంపై, 76 అర్జీలు పునరుద్ధరణ (రీ-ఓపెన్) కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఆత్మకూరు పరిధిలో 527, నంద్యాల పరిధిలో 591 రీ-ఓపెన్ అర్జీలు ఉన్నాయని, అధికారుల నుంచి సమగ్ర సమాధానం రాకపోవడం వల్లే ఇవి తిరిగి వస్తున్నాయని స్పష్టం చేశారు. వచ్చే వారంలోగా పెండింగ్ అర్జీలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని సూచించారు.అలాగే భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిక్స్’ ద్వారా 160 దరఖాస్తులు అందాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *