Thursday, 3 September 2026

Tag: కలెక్టర్

నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పెంచాలి: నంద్యాల కలెక్టర్ రాజకుమారి

నంద్యాల :ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించి, అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.అర్జీదారులను నేరుగా కార్యాలయానికి పిలిపించి సమస్యలు పరిష్కరించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని, ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ (ROR) అంశాల్లో పురోగతి సాధించాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో 39 కీలక పనితీరు సూచికలను (KPIs) వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.అలాగే, అధికారులు మరియు సిబ్బంది పెండింగ్‌లో ఉన్న ఐ-గాట్ (i-GOT) కోర్సులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో అమలుచేసే ఉత్తమ విధానాలపై నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ‘నెలలో నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు మండలాల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాల కలెక్టరేట్‌లో PGRS సమీక్ష: ‘రీఓపెన్‌’ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం

నంద్యాల :ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, అవి మళ్లీ ‘రీఓపెన్‌’ కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పిజిఆర్‌ఎస్ అనంతరం అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 5,513 రీఓపెన్‌ అర్జీలలో ఇప్పటికే 5,444 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 69 దరఖాస్తులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లోనే రీఓపెన్‌ అర్జీలు ఎక్కువగా ఉన్నందున ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా 137 భూ సమస్యల అర్జీలు రాగా, సోమవారం పిజిఆర్‌ఎస్‌లో మొత్తం 272 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ రామునాయక్‌, నోడల్‌ అధికారి ఉమామహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

ప్రజల చెంతకే పాలన: కలెక్టర్ రాజకుమారి గణియా

పాములపాడు :ప్రజలు జిల్లా కేంద్రానికి రానవసరం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. “వన్ మంత్–ఫోర్ విజిట్స్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో పాములపాడు, కొత్తపల్లి మండలాల ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, రీ-సర్వే, పింఛన్లు, తాగునీరు, గృహ నిర్మాణం, NH-340C భూసేకరణ నష్టపరిహారం సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల:జిల్లాలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 22-A జాబితా సవరణలు, రీ–సర్వే, డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్లపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. 5వ విడత రీ–సర్వేలో గ్రౌండ్ ట్రూథింగ్ (GT) పనులను ఆగస్టు 31 నాటికి, నిలిచిపోయిన DLR పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిఫెక్టెడ్ గ్రామాల్లో రీ–సర్వేను వేగవంతం చేసేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లకు వర్చువల్ విధానంలో ఓరియంటేషన్ నిర్వహిస్తామన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా నివేదికలను మండల స్థాయి నుంచే జాయింట్ కలెక్టర్‌ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నంద్యాల

రేపు పాములపాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

నంద్యాల :ప్రజా సమస్యల క్షేత్రస్థాయి పరిష్కారం కోసం చేపట్టిన ‘వన్ మంత్‌–ఫోర్‌ విజిట్‌’లో భాగంగా ఈ నెల 28న పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొని, పాములపాడు, కొత్తపల్లె మండలాల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులపై వచ్చే అర్జీలను జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

నంద్యాల

అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు: కలెక్టర్ జి. రాజకుమారి గనియా

నంద్యాల:ప్రజా పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 4,543 పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటంపై, 76 అర్జీలు పునరుద్ధరణ (రీ-ఓపెన్) కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఆత్మకూరు పరిధిలో 527, నంద్యాల పరిధిలో 591 రీ-ఓపెన్ అర్జీలు ఉన్నాయని, అధికారుల నుంచి సమగ్ర సమాధానం రాకపోవడం వల్లే ఇవి తిరిగి వస్తున్నాయని స్పష్టం చేశారు. వచ్చే వారంలోగా పెండింగ్ అర్జీలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని సూచించారు.అలాగే భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిక్స్’ ద్వారా 160 దరఖాస్తులు అందాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నంద్యాల

జలధార’ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో చేపడుతున్న జలధార–జలహారతి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు, నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు, మిత్తూర్ మండలాల్లో పనుల పురోగతి మందగించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రెండో విడత పనుల ఫొటోలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

నంద్యాల

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన

నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పి. ప్రశాంతి పరిశీలించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈ నెల 25న ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 26న అధికారులతో సమీక్ష జరిపి ఓటర్ల జాబితా సవరణపై సూచనలు చేయనున్నారు.ఓటర్ల జాబితా నమోదు, సవరణల అధికారిక వివరాలు మరియు సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ సీఈఓ పోర్టల్ లేదా ఈసీఐ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ని చూడవచ్చు.

నంద్యాల

SIR నోటీసుల పంపిణీ 100% పూర్తి చేయాలి

నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్‌లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

నంద్యాల : జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఆగస్టు 17న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.అర్జీల పరిష్కార స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్‌ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.