నందలూరులో ఘనంగా పాదువ పూరి అంతోని వారి స్వరూప ప్రతిష్ఠ
నందలూరు, సెప్టెంబర్ 2: కడప జిల్లా నందలూరు మండలంలోని సెయింట్ జోసెఫ్ కతోలిక చర్చిలో పాదువ పూరి అంతోని వారి స్వరూప ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వికర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ ఎం.డి. ప్రసాదరావు, కడప డీన్ అల్లరి జోసఫ్ రాజు, ప్రోక్రేటర్ రెవరెండ్ ఫాదర్ బాకీ రవీంద్ర, రాజంపేట విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ లారెన్స్, నందలూరు విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ తల్లారి రమేష్ తదితరుల చేతుల మీదుగా అంతోని వారి మండపాన్ని ప్రారంభించారు.
మండప ప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ సిస్టర్స్, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

