Friday, 4 September 2026

Tag: కలెక్టర్

నంద్యాల

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన

నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పి. ప్రశాంతి పరిశీలించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈ నెల 25న ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 26న అధికారులతో సమీక్ష జరిపి ఓటర్ల జాబితా సవరణపై సూచనలు చేయనున్నారు.ఓటర్ల జాబితా నమోదు, సవరణల అధికారిక వివరాలు మరియు సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ సీఈఓ పోర్టల్ లేదా ఈసీఐ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ని చూడవచ్చు.

నంద్యాల

SIR నోటీసుల పంపిణీ 100% పూర్తి చేయాలి

నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్‌లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

నంద్యాల : జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఆగస్టు 17న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.అర్జీల పరిష్కార స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్‌ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

పింఛ‌నుతో పాటు మామిడిపండ్ల‌ను అంద‌జేసిన‌ జిల్లా క‌లెక్ట‌ర్*

విశాఖ‌ప‌ట్ట‌ణం, జూన్ 01 ః రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. సోమ‌వారం ఉద‌యం జ్ఞానాపురం వ‌ద్ద‌ ప‌లువురు వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు, వితంతువుల‌కు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి పింఛ‌న్ల మొత్తాన్ని అంద‌జేశారు. అలాగే జ్ఞానాపురంలో ఓ వితంతు మ‌హిళ‌కు రూ.4,000 పింఛ‌ను సొమ్ముతో పాటు మామిడి పండ్ల‌ను కూడా క‌లెక్ట‌ర్ అందించారు. దీనిపై ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పింఛ‌న్ల పంపిణీ క్ర‌తువు గురించి అడిగి తెలుసుకున్న ఆయ‌న‌ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా డీఆర్డీఏ, యూసీడీ పీడీల‌ను ఆదేశించారు. జ్ఞానాపురం వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్రమంలో డీఆర్డీఏ పీడీ ల‌క్ష్మీప‌తి, జీవీఎంసీ సీఎంవో న‌రేశ్ కుమార్, జడ్సీ మ‌ల్ల‌య్య‌నాయుడు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, స‌చివాల‌య ఉద్యోగులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.