డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం లక్కవరం శివారులోని ఓఎన్జీసీ సైట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరానికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్కవరానికి చెందిన ముదునూరి రామభద్రరాజు, ఆయన తమ్ముడు వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న వారి భార్యలు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇంటికి చేరువలో జరిగిన ఈ విషాద ఘటనతో లక్కవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇంకో 2 నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. అంతలోనే కబళించిన మృత్యువు!
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం లక్కవరం శివారులోని ఓఎన్జీసీ సైట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరానికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్కవరానికి చెందిన ముదునూరి రామభద్రరాజు, ఆయన తమ్ముడు వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి భార్యలు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటికి చేరువలో జరిగిన ఈ విషాద ఘటనతో లక్కవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

