బీజేపీ కిసాన్ మోర్చా మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా ఖమ్మం జిల్లాకు చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనను ఈ బాధ్యతలకు ఎంపిక చేసింది. రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చావా కిరణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చావా కిరణ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.


