Monday, 20 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 19, (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని వాయులింగేశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబికా దేవిలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవూరు నియోజకవర్గ సుభిక్షం, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సేవకు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించడం పట్ల చైర్మన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయ విశేషాలను, భక్తుల కోసం అక్కడ చేపడుతున్న వివిధ వసతుల అభివృద్ధి పనులను ఆమెకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.