రాజమహేంద్రవరం, ఆగస్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IASను అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.



