Saturday, 19 September 2026
  • Home  
  • 40 మంది లబ్ధిదారులకు రూ.13.39 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
- నిర్మల్

40 మంది లబ్ధిదారులకు రూ.13.39 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కూచాడి శ్రీహరిరావు నిర్మల్: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13 లక్షల 39 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, కూచాడి శ్రీహరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కూచాడి శ్రీహరిరావు
నిర్మల్: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13 లక్షల 39 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, కూచాడి శ్రీహరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.