అనకాపల్లి జిల్లా, యలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామపంచాయతీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కాపారపు ఆదినారాయణ విధి నిర్వహణలో కాలికి తీవ్ర గాయమై ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పనికి వెళ్లలేక, సరైన వైద్య చికిత్స పొందలేని పరిస్థితిలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
గ్రామ పరిశుభ్రత కోసం రోజూ కాలువలు, చెత్త తొలగింపు వంటి ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస భద్రతా పరికరాలు (సేఫ్టీ ఎక్విప్మెంట్స్), ఆరోగ్య రక్షణ చర్యలు, వైద్య సౌకర్యాలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పనులు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య సమస్యలతో విధులు మానేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.
గాయపడిన కాపారపు ఆదినారాయణకు తక్షణ వైద్య చికిత్స, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


