జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే నిలిపివేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం, మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఎంఈవోలు, డీఈవోలు తదితర కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిపడా లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని అన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. విద్య ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధ హక్కు అని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత, అందుబాటు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకుండా ప్రజలందరూ ఐక్యంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల జూలై 10న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ప్రీతమ్, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి – ఏఐవైఎఫ్ భాస్కర్
జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే నిలిపివేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం, మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఎంఈవోలు, డీఈవోలు తదితర కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిపడా లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. విద్య ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధ హక్కు అని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత, అందుబాటు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకుండా ప్రజలందరూ ఐక్యంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల జూలై 10న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ప్రీతమ్, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

