Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

*పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!*

*పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!*

పల్లెటూర్లో ప్రజలు ముఖ్యంగా రైతులకు ఎదురయ్యే ప్రమాదాల్లో ప్రముఖమైనది పాముకాటు. మన ప్రాంతాల్లో ఉండే అత్యంత విషసర్పాల్లో రెండు, మూడు రకాలే ఎక్కువగా మనకు ఎదురవుతుంటాయి.
నాగుపాము, రక్తపింజరి, కట్లపాము ఈ మూడు పాముకాట్లే మనిషి ప్రాణాలను తీస్తుంటాయి. పాము కాటు వేసిన గంటలోపే ఆస్పత్రులకు వెళ్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మారుమూల గ్రామాల ప్రజలు సరైన సమయంలో ఆస్పత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోతుంటారు. వారి కోసం ప్రభుత్వం ఇకపై 108లోనూ పాముకాటుకు మందును ఉంచింది.

ప్రభుత్వం చేసిన ఈ కొత్త ఆలోచనతో ఎంతోమంది రైతులు, ప్రజలు సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ప్రమాదం జరిగినా కొద్ది క్షణాల్లోనే 108 అక్కడ ఉంటుంది. ఈ 108లో ఎక్కువగా యాక్సిడెంట్ కేసులే వస్తుంటాయి. దానికి సంబంధించిన మందులే ఉంటాయి. అత్యవసర చికిత్స చేసేందుకు అనుకూలమైన విధంగా 108 వాహనాలను సిద్ధం చేశారు. ఇకపై అందులో పాముకాటు మందు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

*పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *