Thursday, 9 July 2026
  • Home  
  • “బూత్ బలోపేతానికి కార్యాచరణ.. మల్లారపు సంతోష్ రెడ్డి, కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ బీఎల్‌ఏల సమావేశం”
- రాజన్న సిరిసిల్ల

“బూత్ బలోపేతానికి కార్యాచరణ.. మల్లారపు సంతోష్ రెడ్డి, కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ బీఎల్‌ఏల సమావేశం”

రాజన్న సిరిసిల్ల జిల్లా/ గంభీరావుపేట్ గంభీరావుపేట, జూలై 8: బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కోడె రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మల్లారపు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి బూత్‌ను బలోపేతం చేయడంతో పాటు ఓటరు నమోదు, ఓటరు జాబితాలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ పొన్నాల మహేష్, బండ దేవయ్య, బీఎల్‌ఏ-2 సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా/ గంభీరావుపేట్

గంభీరావుపేట, జూలై 8: బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కోడె రమేష్ అధ్యక్షత వహించారు.
సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మల్లారపు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి బూత్‌ను బలోపేతం చేయడంతో పాటు ఓటరు నమోదు, ఓటరు జాబితాలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ పొన్నాల మహేష్, బండ దేవయ్య, బీఎల్‌ఏ-2 సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.