Thursday, 9 July 2026

Blog

News

గూడూరు పరిసర ప్రాంతాల దేవాలయాల ఈవో రవిశంకర్ పై జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేతలు, ఆలయ కమిటీ ఫిర్యాదు*

*🟥గూడూరు పరిసర ప్రాంతాల దేవాలయాల ఈవో రవిశంకర్ పై జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేతలు, ఆలయ కమిటీ ఫిర్యాదు* *🟥దేవుడి హుండీ ఆదాయం, భక్తులు సమర్పించే కానుకలను ఈవో తన సొంత ఖర్చులకు వాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణ* *🟥గత ఆరు నెలలుగా అర్చకులకు కనీస వేతనాలు, స్వామివారి ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఈవో నిర్లక్ష్యం – రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు* *🟥సమావేశాలకు హాజరైనా మినిట్స్ బుక్‌లో వివరాలు నమోదు చేయకుండా, కమిటీని పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వైనం – ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు* *🟥శివరాత్రి హుండీ ఆదాయం, దర్శన టికెట్ల ద్వారా వచ్చిన సుమారు రూ. 5 లక్షల దేవుడి సొమ్ములో భారీగా గోల్‌మాల్ – జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి* *🟥దేవస్థానానికి చెందిన 4.11 సెంట్ల భూమిని ఎవరికి కౌలుకు ఇచ్చారో కమిటీకి కూడా చెప్పకుండా గోప్యత* *🟥దేవుడి నిధులను పక్కదారి పట్టించిన అవినీతి ఈవోపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ గూడూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు దేవాలయాలకు కార్యనిర్వహణాధికారి (ఈవో)గా వ్యవహరిస్తున్న రవిశంకర్ భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్, బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆలయ చైర్మన్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు ఈ మేరకు కలెక్టర్‌కు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, హుండీ ఆదాయాన్ని ఈవో తన సొంత ఖర్చులకు వాడుకుంటూ, దేవుడి కైంకర్యాలను, సిబ్బంది వేతనాలను గాలికొదిలేశారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 2025 డిసెంబర్ 15వ తేదీన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి నేటి వరకు ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనాలు ఇవ్వకపోగా, స్వామివారికి నిత్యం జరగాల్సిన ధూప, దీప నైవేద్యాలకు సైతం ఈవో రవిశంకర్ డబ్బులు మంజూరు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నూతన కమిటీ ఏర్పడిన ఈ ఆరు నెలల కాలంలో నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించగా, ఆ సమావేశాలకు ఈవో మొక్కుబడిగా హాజరవుతున్నారే తప్ప, చర్చించిన అంశాలను కనీసం మినిట్స్ బుక్‌లో నమోదు చేయడం గానీ, కమిటీ సభ్యుల సంతకాలు తీసుకోవడం గానీ చేయడం లేదని వారు ఆరోపించారు. ఒకవైపు ఆలయ కమిటీ చొరవ తీసుకుని దాతల నుంచి సుమారు ఆరు లక్షల రూపాయల విరాళాలు సేకరించి, పారదర్శకంగా రసీదులు ఇస్తూ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతుంటే, ఈవో తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఆలయ ఆదాయం, హుండీ లెక్కల విషయంలో ఈవో వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు పలు ఆధారాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ ఏర్పడక ముందు డిసెంబర్ 5న జరిగిన హుండీ లెక్కింపులో రూ. 1,14,000 ఆదాయం రాగా, ఫిబ్రవరి నెలలో హుండీ ఆదాయం, శివరాత్రి ప్రత్యేక దర్శన టికెట్లు, టెంకాయలు, పాలు తదితర విక్రయాల ద్వారా మరో రూ. 3,86,000 ఆదాయం సమకూరింది. అయితే ఇంత భారీ మొత్తంలో నిధులు వచ్చినప్పటికీ, ఈవో రవిశంకర్ కేవలం ఒకసారి 40 వేలు, మరోసారి లక్ష రూపాయలు మాత్రమే ఆలయ అవసరాలకు ఇచ్చి, మిగతా దేవుడి సొమ్మును పక్కదారి పట్టించారని వారు ఆరోపించారు. దీనికి తోడు దేవస్థానానికి చెందిన 4.11 సెంట్ల భూమిని ఎవరికి కౌలుకు ఇచ్చారు, దాని ద్వారా ఎంత కౌలు వస్తుందనే కనీస సమాచారాన్ని కూడా కమిటీకి తెలియజేయకుండా ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఆస్తులకు, నిధులకు రక్షణ లేకుండా పోతోందని, తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. దేవాలయానికి రావాల్సిన నిధులకు పక్కాగా లెక్కలు చూపించేలా ఈవోను ఆదేశించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న అర్చకుల వేతనాలు, ధూప దీప నైవేద్యాల ఖర్చులను తక్షణమే ఇప్పించాలని, అవినీతికి పాల్పడిన ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో గూడూరు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు కే. దయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

News

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం*

*🚍కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం* *🚍మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసరా ప్రాంతంలోనే బస్సు పాసుల జారీ* *🚍ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రత్యేక బస్ పాస్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి* *🚍జిల్లాల విభజనతో కోట బస్టాండ్ నెల్లూరు జిల్లాకు, వాకాడు డిపో తిరుపతి జిల్లాకు మారడం వల్లే ఈ నిర్ణయం* *🚍విద్యార్థులు, ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో పరిసర బస్సు పాస్ కౌంటర్ కి వెళ్లి పాసులు పొందాలి* *———————* *✍🏽మునిరాజ్ 👇🏽* *జర్నలిస్ట్* *———————-* కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన విద్యార్థులు, సీజన్ పాస్ దారులకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కీలక సమాచారం అందించారు. ఈ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రయాణికులు ఇకపై బస్సు పాసుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే పాసుల జారీ ప్రక్రియను చేపట్టనున్నట్లు వాకాడు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ పాస్ కేంద్రం వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, పాస్ దారులు నేరుగా అక్కడికి చేరుకుని తమ పాసులను పొందవచ్చని వారు కోరారు. *🚍జిల్లాల పునర్విభజన కారణం: వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు* ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా ఆర్టీసీ డిపోల పరిధిలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా కోట ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్లడంతో పాటు, గూడూరు డిపో పరిధిలో విలీనమైంది. మరోవైపు, వాకాడు డిపో తిరుపతి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. పరిపాలనాపరమైన ఈ మార్పుల దృష్ట్యా, తిరుపతి జిల్లా పరిధిలోని ప్రజల సౌకర్యార్థం బస్సు పాస్ కౌంటర్‌ను వాకాడు డిపో పరిసరాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ భౌగోళిక మార్పులను గమనించి విద్యార్థులు, సాధారణ పాస్ దారులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో బస్ పాస్ సెంటర్ వద్దకు వెళ్లి సేవలు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బెస్ట్ వాకర్స్ విద్యాసాయం

బెస్ట్ వాకర్స్ తరఫున వెంగళరావునగర్ కు చెందిన డ్రైవర్ రవికుమార్ కుమార్తె అయిన సాయి స్నేహ కి మూడో సంవత్సరము బీటెక్ ఫీజు నిమిత్తము 10,000 రూపాయలు అందచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ వాకర్స్ తరపున సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్న క్రమం లో భాగంగా ఈ విద్యా సాయం అందించినట్లు బెస్ట్ వాకర్స్ ప్రెసిడెంట్, విశ్రాంత యస్.ఐ టీవీ శేషయ్య తెలిపారు. కార్యక్రమం లో ట్రెజరర్ శ్రీనివాసులు, సెక్రెటరీ మంద వెంకటేశ్వర్లు ,సభ్యులు గోపాల్ హెడ్ కానిస్టేబుల్ కుమార్ , బుజ్జి , గోపాల్ భాస్కర్ నాయుడు శ్రీకాంత్, జోగి కృష్ణ పాల్గొన్నారు.

అనకాపల్లి

దేశ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు… డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఘనంగా….!

అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భారతీయ జనతా పార్టీ ఎలమంచిలి మండలం రూరల్ ఆధ్వర్యంలో ఏటికొప్పాక గ్రామంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు, జాతీయ సమైక్యతకు అంకితభావంతో సేవలందించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధానులు ఉండరాదు” అనే నినాదంతో దేశ సమగ్రత కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. భారతదేశ అఖండత, జాతీయత పరిరక్షణలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, యువత ఆయన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు, కిసాన్ మోర్చా కార్యదర్శులు ఉగ్గిన్ బాబ్జి, కడారి దుర్గారావు, చుక్కల శ్రీను, లంక ఈశ్వరరావు, లావేటి సురేష్, నాగిరెడ్డి శివతో పాటు పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

ఖమ్మం

ఖమ్మంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఘన స్వాగతం

ఖమ్మం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని ఎన్ఎస్పీ అధికారుల అతిథి గృహానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన అంశాలపై పర్యటన కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

ముక్కంటి లయంలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు-భక్తులకు అసౌకర్యం కలగొద్దు

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు (చైర్మన్) కొట్టే సాయి ప్రసాద్ సోమవారం నాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేసే చౌల్త్రీలను, లాకర్ గదులను స్వయంగా పరిశీలించారు. వాటికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన పలువురు యాత్రికులతో చైర్మన్ నేరుగా మాట్లాడారు. దేవస్థానం తరఫున వారికి అందుతున్న వసతులు, అందుతున్న సేవల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ భద్రతా విభాగం పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, భద్రత విషయంలో ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆలయ అధికారులను, సిబ్బందిని గట్టిగా ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం శ్రీకాళహస్తి క్షేత్రానికి విచ్చేస్తుంటారని గుర్తుచేశారు. అలా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆలయ సిబ్బందిపై ఉందన్నారు. పరమశివుని దర్శనార్థం ఆలయానికి వచ్చే యాత్రికులు ఎవరూ కూడా ఇక్కడి వసతులపై అసంతృప్తితో తిరిగి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరికీ సంతృప్తికరమైన దర్శనం కలిగేలా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు సోమవారం శ్రీకాళహస్తిలోని బెరివారి మండపం కూడలిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….1901 జూలై 6న జన్మించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అఖండ భారతదేశ నిర్మాణం, జాతీయ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన, కాశ్మీర్‌కు సంబంధించిన విధానాలను వ్యతిరేకిస్తూ 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించి జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాదులు వేశారని అన్నారు. “ఒకే దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు చెల్లవు” అంటూ ముఖర్జీ చేసిన ఉద్యమం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, యువత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు ఆర్. హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జి.వి. అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, మద్దు వాసు యాదవ్, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, లింగాబత్తిన గోపాల్, తానికొండ్ల భరత్ నాయుడు, పెద్దదాసరి శివారెడ్డి, బొక్కసం కిరణ్మణి, చోటు, సుబ్బరామిరెడ్డి, వీరస్వామి, కుమార్ నాయుడు, గోవర్ధన్, మురళీ, యశ్వంత్, నాగశేషు, శివా యాదవ్, గాధిపాకుల యతీశ్, హుకీం సింగ్, కోలే షణ్ముగం, సజ్జా హరీష్, రాజు, ఢిల్లీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా మృత్యుంజయ స్వామి ప్రత్యేక పూజలు

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు మృత్యుంజయ మూలవిరాట్ స్వామివారి సన్నిధిలో కలశ స్థాపన చేసి, పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ధూప, దీప, కర్పూర హారతులు సమర్పించడంతో పాటు ప్రత్యేక నైవేద్యాలు అర్పించారు. ఈ సందర్భంగా లోకక్షేమం, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సర్వసంపదలు కలగాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, పీఆర్ఓ రవి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సిఐ వెంకటేష్‌కు కాంగ్రెస్ నేతల సన్మానం

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ వలయాధికారి (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్‌ను శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్‌కు దుశ్శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలో రోజురోజుకూ జటిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యలను క్రమబద్ధీకరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, పార్టీ సీనియర్ నాయకులు నాగూర్ షేక్, మునికృష్ణయ్య, చందు, అరుణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

త్వరలోనే ‘స్కిట్’ కాలేజీ పునఃప్రారంభం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము ఎంతో కాలంగా శ్రమిస్తున్న ‘స్కిట్’ ఇంజనీరింగ్ కాలేజీ పునఃప్రారంభంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పక్కా భరోసా ఇచ్చారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేదికపైనే మంత్రి లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కళాశాల పునఃప్రారంభానికి కావలసిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే లభించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనంతపూర్ అనుసంధానంతో త్వరలోనే శ్రీకాళహస్తి నుంచే నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. విద్యతో పాటు శ్రీకాళహస్తి ప్రాంతానికి మరిన్ని కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారని సుధీర్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గ విద్యా, పారిశ్రామిక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పూర్తి మద్దతు పలికిన మంత్రి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.