Thursday, 9 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కల్లూరు

*”అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కాకాణి”* *SPSR నెల్లూరు జిల్లా* *తేదీ 07.07.2026* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, నరుకూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు* – *జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగితే, కూటమి పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందన్న కాకాణి* – *కూటమిపాలనలో అభివృద్ధి శూన్యం, ప్రచారం ఘనం అన్నట్టుగా తయారైందని విమర్శించిన కాకాణి* – *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించామని, కూటమి పాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్న కాకాణి* – *”సర్” ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి, తెలుగుదేశం పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని దిశా నిర్దేశం చేసిన కాకాణి* – *ఇటీవల వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పవన్ సోదరి నందిని, శ్రీకాంత్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి* – *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్* – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశాం – జగనన్న ముఖ్యమంత్రిగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చాం – జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసి, ప్రజలకు అందజేశాం – జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రి గా గ్రామాలలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు ,త్రాగునీటి వసతి తోపాటు,రైతులకు సజావుగా, సాఫీగా సాగునీరు అందించాం – కూటమిపాలనలో ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చినవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకుంటూ తీరని ద్రోహానికి పాల్పడుతున్నారు – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఇళ్లు కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు – పెన్షన్లు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, గడిచిన 25 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం విడ్డూరం! – చంద్రబాబు నాయుడు అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ మంజూరు చేయడంతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీలకు, ఎస్సీలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేసి, మాట నిలబెట్టుకోవాలి – చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు – గ్రామాలలో ఎక్కడ చూసినా దోపిడీ తప్ప, అభివృద్ధి ఊసే లేదు – ఇరిగేషన్ పేరిట పనులు చేయకుండానే దొంగ బిల్లులు డ్రా చేసుకొని, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు – రైతులను అడ్డుపెట్టుకొని దోచుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని రైతులు ఇప్పటికే బాహాటంగా మాట్లాడుతున్నారు – ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, వెంటనే మమ్మల్ని సంప్రదించాలి – చంద్రబాబు ప్రజల్లో పరపతి కోల్పోయి ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు – తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు చేర్పించుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి – బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ సమిష్టిగా, సమర్థవంతంగా, అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎదుర్కోవాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను కాపాడుకోవడంతోపాటు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను చేర్పించే ప్రయత్నాన్ని నిరోధించాలి – తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది – ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆగడాలను ఎదిరించి తీరుతాం తప్ప, ఉపేక్షించే ప్రసక్తే లేదు – జిల్లాలో ఎక్కడైనా బూత్ లెవెల్ అధికారులు, నియమ నిబంధనలకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, వెంటనే మా దృష్టికి తీసుకురావాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఓటు కాపాడుకోవడంతోపాటు, తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరనివ్వకుండా ఖచ్చితంగా పోరాడి నిలువరిస్తాం

నిజామాబాద్

ఆ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలి: సీఎం రేవంత్

TG: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారికి కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజ్ చేయాలని, సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News

ఆ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలి: సీఎం రేవంత్

TG: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారికి కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజ్ చేయాలని, సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అన్నా మినిస్ట్రీస్ సౌజన్యంతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మంగళవారం ఉదయం అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కె ఎస్ టి ఏ నందు గల 49 మంది విద్యార్థులకు ఉచితంగా వ్రాత పుస్తకాలు చైర్మన్ పమ్మి సత్యనారాయణ అందజేశారు అంబేద్కర్ మహాశయుని ముఖచిత్రంతో గల నోటు పుస్తకాలు అందివ్వటం చాలా సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోలాటి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకరరావు అడ్మినిస్ట్రేటర్ నేకూరి రాజేష్ కుమార్, హైకోర్టు న్యాయవాది ఐ.ఇ.కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా రాత పుస్తకాలు పంపిణీ చేయడానికి పలువురు సంతోషం వ్యక్తపరిచి అభినందించారు.

నిజామాబాద్

ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే

యూరియా యాప్ బుకింగ్‌లో మార్పులు 2 ఎకరాల రైతులు కేవలం 4 యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలి 2 నుండి 5 ఎకరాల మధ్య రైతులు రెండు విడతల్లో.. 5 ఎకరాల పైన రైతులు మూడు విడతల్లో (40%, 30%, 30%) యూరియా బుక్ చేసుకోవాల్సిందే ఒక్కో బుకింగ్‌కి మధ్య 20 రోజుల వ్యవధి తప్పనిసరి ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తూ ఈ నిబంధనలు ఎంటని రైతుల అసహనం

ఖమ్మం

శ్రీనగర్ కాలనీలో SIR కార్యక్రమంపై అవగాహన…..పాల్గొన్న బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

ఖమ్మం జులై (పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ ) ఖమ్మం నగరము లో ని శ్రీనగర్ కాలనీ 165వ పోలింగ్ బూత్‌లో నిర్వహించిన SIR కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో కలిసి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

కార్ల్ మార్క్స్ ‘అర్థశాస్త్ర విమర్శ’ – సమాజాన్ని మార్చిన ఆలోచనల గ్రంథం

1859లో కార్ల్ మార్క్స్ రచించిన ‘అర్థశాస్త్ర విమర్శ’ (A Contribution to the Critique of Political Economy) ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటంపై కొత్త దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ గ్రంథంలో సమాజ అభివృద్ధికి ఆర్థిక నిర్మాణమే పునాదిగా ఉంటుందని మార్క్స్ వివరించారు. పెట్టుబడిదారీ విధానంలోని అసమానతలను విశ్లేషిస్తూ, శ్రమ విలువ, సామాజిక మార్పు వంటి అంశాలను చర్చించారు. నేటికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక అధ్యయనాల్లో ఈ రచనకు విశిష్ట స్థానం ఉంది.

సాహితీ

🌅 ఉదయాన్ని గెలిస్తే… జీవితాన్ని గెలిచినట్టే!

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాఠకులను ప్రేరేపించిన “ది 5 AM క్లబ్” (తెలుగు ఎడిషన్) పుస్తకం వ్యక్తిగత అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది. రచయిత రాబిన్ శర్మ ఉదయం 5 గంటలకు లేచి క్రమశిక్షణతో రోజును ప్రారంభించడం ద్వారా ఉత్పాదకత, ఏకాగ్రత, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని వివరించారు. ఇందులోని ప్రసిద్ధ 20/20/20 సూత్రం వ్యాయామం, ధ్యానం, అభ్యాసానికి సమయాన్ని కేటాయించాలని సూచిస్తుంది. చిన్న అలవాట్లే జీవితంలో గొప్ప విజయాలకు పునాది అవుతాయని ఈ పుస్తకం తెలియజేస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు సభకు రాలేదని.. ఉపాధి హామీ కూలీలపై ఫీల్డ్ అసిస్టెంట్ కక్ష సాధింపులు

చంద్రబాబు సభకు రాలేదని.. ఉపాధి హామీ కూలీలపై ఫీల్డ్ అసిస్టెంట్ కక్ష సాధింపులు ఈ నెల 1న పునపర్తిలో చంద్రబాబు సభకు రావాలని టీడీపీ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్.. ఉపాధి హామీ కూలీలకు ఆదేశాలు కానీ.. తాము రాలేమని ముందే చెప్పి సభకు దూరంగా ఉండిపోయిన కూలీలు. దాంతో ఇప్పుడు మీకు ఉపాధి హామీ పని కల్పించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులు చిల్లకూరు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉడతావారి పాలెం గ్రామస్తులు నిరసన మీ సభకు రాకపోతే.. ఉపాధి హామీ కూలీల పొట్టగొడతారా

నిజామాబాద్

పట్టా పాస్ బుక్ లేని రైతుల పరిస్థితి ఏంటి…యూరియా కష్టాలు మాకు తీరేది ఎన్నడు…..

పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ద్వారా అందిస్తున్న యూరియాను పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు ఆన్లైన్లో తప్పుగా నమోదైన వివరాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాగీర్దారీ, సీలింగ్, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేస్తున్న వారికి కొత్త యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టమవుతోంది. ధరణి సమస్యలు, రెవెన్యూ సిబ్బంది తప్పిదాలు, వారసత్వ వివాదాలు, ఆన్లైన్ లోపాల వల్ల చాలామందికి పాస్ పుస్తకాలు లేవు ఇబ్బందిగా ఉంది..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.