Monday, 20 April 2026

Blog

మహబూబ్ నగర్

వేసవి శిబిరాలు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి

*సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 15/04/2026* *మహబూబ్ నగర్ నగరంలోని భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ హైస్కూల్‌లో ఆర్‌కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి, జూన్ నెల 5 వరకు నిర్వహించే ఉచిత కరాటే వేసవి శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మర్ క్యాంప్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణలో సదుపాయం కల్పించామని దీనిని గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు కె. రవికుమార్ , జిల్లా అధ్యక్షుడు మహేందర్, సలహాదారులు ఎంఎన్ విజయ్ కుమార్, సాయి లక్ష్మి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు*.

తూర్పు గోదావరి

మోహిత్ ఆధ్యర్యంలో జనసేనకు 200 మంది యువత చేరిక

పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బేరి మోహిత్ ఆధ్యర్యంలో సుమారు 200 మంది యువత జనసేన పార్టీ లో చేరారు. వీరికి అనుశ్రీ సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం  రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప, సోమాలమ్మ  గుడి డైరెక్టర్ తొర్ల పాటి శాలిని, మార్కేండేయస్వామి దేవాలయం డైరెక్టర్ బూడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలాపల్లి సుందరయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ గుత్తులు బుల్లి, తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బహుజన్ సమాజ్ పార్టీ : అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఐ ఎల్ టి డి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను యువత తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ కుమార్, కొండపల్లి సూరిబాబు, అంగడి వంశీ, కొత్తపల్లి శేఖర్, నెల్లి సుబ్బారావు, సుధీర్, మోకాను బాల, కె విస్సు, కళ్యాణ్, పల్లవి తదితరులు, అంబేద్కర్ యూత్, ఏపీ పని యూత్ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఏప్రిల్ –2026 ఫలితాల విడుదల

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): మార్చి –2026లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఫలితాలను ఏప్రిల్ 15, 2026న ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in⁠� ద్వారా చూసుకోవచ్చు. అలాగే 9552300009 అనే మన మిత్ర WhatsApp నంబర్‌కు “Hi” మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనకాపల్లి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఏప్రిల్–2026 ఫలితాల విడుదల

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): మార్చి–2026లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఫలితాలను ఏప్రిల్ 15, 2026న ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in⁠� ద్వారా చూసుకోవచ్చు. అలాగే 9552300009 అనే మన మిత్ర WhatsApp నంబర్‌కు “Hi” మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తిరుపతి

అభిమాన గణం మధ్య ఉన్నం వాసుదేవ నాయుడు బర్త్‌డే సెలబ్రేషన్స్

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తొట్టంబేడు మండలంలోని తన స్వగ్రామమైన పొయ్యలోని స్వగృహంలో వాసుదేవ నాయుడు అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, శ్రీవారి సురేష్‌తో పాటు పార్టీ శ్రేణులు, గ్రామస్థులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

తిరుపతి

బలహీన వర్గాల అభ్యున్నతికిజీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్- కోలా ఆనంద్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, ఆధునిక భారతదేశ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా హక్కుల పరిరక్షణకు జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన అన్నారు. “అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలి” అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు వేడం కృష్ణయ్య, ఆర్ హరీష్ రెడ్డి, ఎస్‌సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గదిపాకుల యాతీష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాకు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా మాజీ భాజపా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా డాక్టర్ చంద్రప్ప దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఆమెకు వివరించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని ఆమెకు బహుకరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వచ్చిన ఆమెకు పలువురు నాయకులు, ప్రముఖులు విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి

సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గమే దారి- జనసైనికులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలో పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఘననివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత పోరాటం ఆయన ఆశయాలను జనసైనికులు స్మరించుకుటూ… చిన్న వయసులోనే అనేక కష్టాలను ఎదుర్కొని, కుల వివక్షతను అనుభవిస్తూ కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, కుల వివక్ష లేని సమాజం నిర్మాణమే ఆయన లక్ష్యమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని, ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ పనిచేస్తుండటం గర్వకారణమని తెలిపారు. ఇదే ఏప్రిల్ 14 తేదీన 28 సంవత్సరాల క్రితం స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని స్మరించారు. అదే తేదీన ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహం వద్ద సుందర వాతావరణం ఏర్పడటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బందికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

తిరుపతి

సేవకు నిలువెత్తు రూపం ‘అమ్మ ఆశ్రమం’-25 ఏళ్ల ప్రస్థానంపై ఎమ్మెల్సీ ప్రశంసలు

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలంలోని శివనాథపురంలో వున్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సృష్టిలో అంతులేని అనురాగాన్ని కరుణను కురిపించేది కేవలం అమ్మ మాత్రమేనని, అలాంటి మాతృమూర్తి సేవలకు ప్రతిరూపం ‘అమ్మ ఆశ్రమం’ అని గత 25 ఏళ్లుగా నిరంతర కృషితో, సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు భూలక్ష్మి మేడమ్ సేవలను అభినందిస్తూ ఆమెను ఘనంగా దుశ్శాలువాతో సత్కరించారు. అమ్మ ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఈ ఆశ్రమం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆశ్రమ సేవలను కొనియాడారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.