Thursday, 9 July 2026

Blog

మహబూబ్ నగర్

ప్రత్యేక టెట్ నిర్వహణ చేయాలని వినతి పత్రం అందిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

*ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 07/0 8 /2026* ➡️ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల ధన్యవాదాలు ➡️ ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2028 సెప్టెంబర్‌లోగా ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని నిర్దేశించిన నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ వర్గాలు స్వాగతించాయి. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని* తెలంగాణ ఉపాధ్యాయుల తరఫున రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.ఎన్. విజయ కుమార్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు వారి సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రేస్ మార్కులు కేటాయించాలని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

క్రైమ్

అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి.. స్థానికులు పోలీసు అధికారులకు సహకరించాలి..

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలిస్తూ పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య (ఐపీఎస్) మంగళవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగలు, ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సేల్ ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.

Featured

10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పరంగి రాము, ఏఐఎఫ్‌డీఎస్ నాయకుడు కాశి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

54వ డివిజన్‌లో SIR (సర్) కార్యక్రమంపై వివరాలు తెలుసుకున్న బీజేపీ నాయకులు

ఖమ్మం జులై (పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ ) ఖమ్మం నగరంలోని 54వ డివిజన్‌లో నిర్వహిస్తున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం అమలు తీరుపై బీజేపీ నాయకులు బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) శ్రీమతి రత్న కుమారి గారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, జిల్లా నాయకులు జిల్లెల్ల నాగరాజు SIR కార్యక్రమం నిర్వహణ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు..

తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ || శే || Dr. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ

08-07-2026, బుధవారం, ఉద‌యం 9 గంట‌ల‌కు) మన జన హృదయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ || శే || Dr. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా, మన ప్రియతమ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ శాసనసభ్యులు “కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి” గారి చేతుల మీదుగ జయంతి వేడుకలు ఘనంగా జరుగుచున్నవి. కావున ఈ వేడుకల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కల్లూరు

E-పేపర్

చదువుకు బదులు సెల్ ఫోన్ లకు బానిసలవుతున్న హాస్టల్ విద్యార్థులు…?

వాచ్‌మెన్, వార్డెన్ పర్యవేక్షణ లోపమా..? వాంకిడి మండల జెడ్పీహెచ్‌ఎస్ హాస్టళ్లపై తల్లిదండ్రుల ఆందోళన వాంకిడి, జూలై 7: ప్రభుత్వం పేద, గిరిజన, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ హాస్టళ్లను నిర్వహిస్తోంది. ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో పరిస్థితులు ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్‌లో నివసిస్తూ చదువుకుంటున్న కొందరు విద్యార్థులు అధ్యయన సమయాల్లో కూడా సెల్‌ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని, దీనికి ప్రధాన కారణం వాచ్‌మెన్, వార్డెన్‌ల పర్యవేక్షణ లోపమేనని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. చదువు కోసం హాస్టల్‌లో చేరిన పిల్లలు పుస్తకాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందిస్తున్నప్పటికీ, హాస్టల్‌కు వెళ్లిన తర్వాత సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గిపోతోందని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియా, వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటిలో సమయాన్ని వృథా చేస్తూ చదువుకు దూరమవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే వారి విద్యా ప్రగతిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడి పిల్లలను చదివించాలనే ఆశతో హాస్టళ్లలో చేర్పించిన తల్లిదండ్రులు ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో క్రమశిక్షణతో చదువుకుంటారని నమ్మి పిల్లలను ఉంచితే, వారు సెల్‌ఫోన్లలో సమయం గడపడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పర్యవేక్షణ బలోపేతం చేయాలన్న డిమాండ్ హాస్టళ్లలో ప్రతి రోజు అధ్యయన సమయాల్లో వార్డెన్‌లు, వాచ్‌మెన్‌లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల వద్ద అనుమతి లేకుండా సెల్‌ఫోన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే విద్యార్థులు చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల అధ్యయన వాతావరణాన్ని దెబ్బతీసే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత హాస్టల్ వార్డెన్‌లు, ప్రధానోపాధ్యాయులు లేదా విద్యాశాఖ అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. ఆరోపణలు వాస్తవమా కాదా అనే అంశాన్ని సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలు వెల్లడించడం ద్వారా తల్లిదండ్రుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News

రోడ్డు వెడల్పు కోసం చెట్ల నరికివేత.. ప్రాణవాయువుపై కనికరం లేదా? విద్యుత్ స్తంభాలను తరలించిన అధికారులు.. హరితహారం చెట్లను కూడా పునర్నాటాలి: స్థానికుల విజ్ఞప్తి

రోడ్డు వెడల్పు కోసం చెట్ల నరికివేత.. ప్రాణవాయువుపై కనికరం లేదా? విద్యుత్ స్తంభాలను తరలించిన అధికారులు.. హరితహారం చెట్లను కూడా పునర్నాటాలి: స్థానికుల విజ్ఞప్తి పున్నమి న్యూస్ ప్రతినిధి 07 జులై 2026 ఇబ్రహీంపట్నం ప్రాంతం: నాగార్జునసాగర్ హైవే నుంచి తక్కల్లపల్లి, మేడిపల్లి, పల్లెచెల్క తండా మీదుగా ఫోర్త్ సిటీ వరకు రోడ్డు వెడల్పు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతుండటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన చెట్లను నరికివేస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించి మరోచోట పునఃస్థాపిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రజలకు ప్రాణవాయువును అందించే చెట్ల విషయంలో కూడా అదే విధమైన శ్రద్ధ చూపాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ స్తంభాలను తరలించగలిగితే, విలువైన చెట్లను కూడా వేరే ప్రదేశాలకు తరలించి పునర్నాటే అవకాశాలను పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, హరితహారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటింది. అయితే ఇప్పుడు అభివృద్ధి పనుల పేరుతో వాటిని పూర్తిగా తొలగించడం పర్యావరణానికి నష్టం కలిగించే చర్యగా భావిస్తున్నారు. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఫార్మాసిటీ పేరుతో భూముల సేకరణ జరిగిన ప్రాంతాల్లో భవిష్యత్తులో పచ్చదనం తగ్గిపోతుందనే ఆందోళన కూడా స్థానికుల్లో వ్యక్తమవుతోంది. చెట్లు లేకుండా పోతే వాతావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే చెరువులు, కుంటలు వంటి సహజ జలవనరులు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. తక్కల్లపల్లి సమీపంలో ఉన్న కుంట అలుగును తొలగించి పైప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించి, సహజ జలమార్గాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు వర్షపు నీటి నిల్వకు, భూగర్భ జలాల పెరుగుదలకు కీలకమని వారు పేర్కొంటున్నారు. అలాగే మేడిపల్లి ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో గుట్టలను తొలగించి వచ్చిన రాళ్లను సమీపంలోని కుంటల్లో వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో నీటి ప్రవాహం దెబ్బతినే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, అదే సమయంలో ప్రకృతి సంపదను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా తొలగించాల్సిన చెట్లను వీలైనంత వరకు వేరే ప్రదేశాలకు తరలించి పునర్నాటాలని, నరికివేయాల్సి వచ్చిన ప్రతి చెట్టుకు బదులుగా మరిన్ని మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ప్రాణవాయువును అందించే చెట్లు, గ్రామాలకు జీవనాధారమైన చెరువులు, కుంటలు రక్షించబడితేనే అభివృద్ధి నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

News ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో తాగునీటి సరఫరా సజావుగా కొనసాగుతోంది: మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్

ఆత్మకూరు, జూలై 7 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సమస్యపై ఇటీవల వస్తున్న కథనాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ స్పందించారు. సోమశిల జలాశయం నుంచి ఆత్మకూరు పట్టణానికి నిరంతరం సరఫరా అవుతున్న మంచినీటి వ్యవస్థలో, సోమశిల ఉత్తర కాలువకు మరమ్మతులు చేపట్టడం వల్ల తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు.కాలువలో మరమ్మతుల పనుల కారణంగా కొద్దిరోజుల పాటు నీటి సమస్య నెలకొన్న మాట వాస్తవమేనని పేర్కొన్న ఆయన, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వెంటనే చర్యలు చేపట్టామని వెల్లడించారు. అదనపు మోటారును ఏర్పాటు చేయడంతో పాటు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి నీటి సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు.ప్రస్తుతం ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సరఫరా సజావుగా కొనసాగుతోందని కమిషనర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా సమస్య ఉంటే ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే ట్యాంకర్లను పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గత రెండు రోజులుగా తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందిని అర్థం చేసుకుని సహకరించిన ఆత్మకూరు పట్టణ ప్రజలకు కమిషనర్ గంగాప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.