Thursday, 9 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ!

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ: శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యం! పొదలకూరు: పొదలకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా శివ రాకేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు పొదలకూరులో విధులు నిర్వహించిన ఎస్సై హనీఫ్ సాధారణ బదిలీల్లో భాగంగా మనుబోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన శివ రాకేష్‌ను ప్రభుత్వం పొదలకూరుకు నియమించింది. ఈ సందర్భంగా శివ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ట్రాఫిక్ సమస్యల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హాస్టళ్లలో వసతులు మెరుగయ్యాయి: ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో గతంతో పోలిస్తే వసతులు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణ కూడా సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందిస్తున్నారని చెప్పారు. గంగిరెద్దుల కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రికార్డుల నిర్వహణ, టి.హెచ్.ఆర్., చిన్నారుల సంరక్షణ, సేవల అమలులో వర్కర్ లక్ష్మీకాంతమ్మ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. యూనియన్ జిల్లా కమిటీ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

తిరుపతి

రేపు వాకాడు లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు

*రేపు వాకాడు లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు** *కార్యక్రమం జయప్రదానికి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్ ఈ సి సభ్యులు కొడవలూరు దామోదర్ రెడ్డి గారి పిలుపు* *దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు రేపు అనగా 8వ తేదీ బుధవారం ఉదయం 9:00 గంటలకు వాకాడు మండల కేంద్రంలోని వాకాడు అశోక్ దగ్గర డాక్టర్ వైయస్సార్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఘన నివాళులర్పించిన అనంతరం పలు సేవ కార్యక్రమం జరుగును.* *కావున వాకాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు బూత్ కన్వీనర్ లకు మరియు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి.* *ఇట్లు* *రాయపు రవీంద్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్*

News

డిగ్రీ లేదు… అనుమతులూ లేవు… డాక్టర్‌గా చెలామణి!

డిగ్రీ లేదు… అనుమతులూ లేవు… డాక్టర్‌గా చెలామణి! బోగస్ క్లినిక్‌పై పోలీసుల మెరుపు దాడి – నకిలీ వైద్యుడు అరెస్ట్ అబ్దుల్లాపూర్‌మెట్, పున్నమి న్యూస్ ప్రతినిధి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య సేవల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఓ నకిలీ వైద్యుడిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అజయ్‌నగర్‌లో “సాయి సాత్విక్ క్లినిక్” పేరుతో అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో నాగోల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో క్లినిక్ నిర్వాహకుడు **అకుల కిషోర్ కుమార్ (44)**ను అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి వైద్య విద్యకు సంబంధించిన ఎలాంటి డిగ్రీ లేదని, క్లినిక్ నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా లేవని తేలింది. అయినప్పటికీ స్టెతస్కోప్ మెడలో వేసుకొని రోగులను పరీక్షిస్తూ, బీపీ కొలుస్తూ, జ్వరం, దగ్గు, ఇతర సాధారణ వ్యాధులకు మందులు రాస్తూ, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో క్లినిక్‌లో బీపీ యంత్రం, థర్మామీటర్లు, సుమారు 40 సిరంజీలు, 8 ఇంజెక్షన్లు, వివిధ రకాల మందులు, ప్రిస్క్రిప్షన్ బుక్, మొబైల్ ఫోన్‌తో పాటు వైద్య సేవలకు ఉపయోగిస్తున్న పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన అర్హతలు లేకుండానే మందులు నిల్వ ఉంచడం, రోగులకు చికిత్స అందించడం, వైద్య వృత్తిని చట్టవిరుద్ధంగా నిర్వహించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలతో ఆటలాడే నకిలీ వైద్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వైద్య అర్హతలు లేని వ్యక్తులు క్లినిక్‌లు నిర్వహించడం తీవ్రమైన నేరమని, ఇలాంటి బోగస్ క్లినిక్‌లు లేదా నకిలీ డాక్టర్ల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత వైద్య శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అనుమతులు లేని క్లినిక్‌లలో చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించే నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఆసుపత్రులు, అర్హత కలిగిన వైద్యుల వద్దే చికిత్స పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, అజయ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఇతర క్లినిక్‌లపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇలాంటి అక్రమ వైద్య కేంద్రాలపై నిరంతర చర్యలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మహబూబ్ నగర్

ప్రత్యేక టెట్ నిర్వహణ చేయాలని వినతి పత్రం అందిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

*ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 07/0 8 /2026* ➡️ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల ధన్యవాదాలు ➡️ ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2028 సెప్టెంబర్‌లోగా ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని నిర్దేశించిన నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ వర్గాలు స్వాగతించాయి. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని* తెలంగాణ ఉపాధ్యాయుల తరఫున రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.ఎన్. విజయ కుమార్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు వారి సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రేస్ మార్కులు కేటాయించాలని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.