Thursday, 9 July 2026

Blog

News

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ తాజా ఛార్జిషీట్

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాకిస్థాన్ కుట్ర, ఉగ్రవాదులకు అందించిన మద్దతు, దాడి వెనుక ఉన్న కీలక ఆధారాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఐఏ తెలిపింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డెంగ్యూ నివారణ మాసోత్సవ అవగాహన కార్యక్రమం

ఆత్మకూరు జ్యోతిరావు పూలే బాలికల గురుకులంలో డెంగ్యూ నివారణ అవగాహన సదస్సు. విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసిన డాక్టర్ సాయి ప్రసన్న. ఆత్మకూరు: యూపీహెచ్‌సీ అరుంధతివాడ,ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం – డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన యూపీహెచ్‌సీ అరుంధతివాడ, ఆత్మకూరు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మందుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎం. సాయి ప్రసన్న హాజరై విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా విద్యార్థినులకు డెంగ్యూ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించారు. దోమలు పెరగకుండా ఇంటి, పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, నీటి నిల్వ పాత్రలను మూతపెట్టడం, వారానికి ఒకరోజు డ్రై డే పాటించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించడం వంటి ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు.అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా డా. ఎం. సాయి ప్రసన్న గారు పాఠశాలలోని వంటశాల (కిచెన్), ఆహార నిల్వ గది (స్టోర్ రూమ్), డైనింగ్ హాల్లను పరిశీలించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం, వంటశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం, విద్యార్థినులకు సురక్షితమైన, పోషకాహారం అందించడం, తాగునీటి పరిశుభ్రతను కాపాడడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రమ్యశ్రీ, హెచ్.ఈ.ఓ. శ్రీ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీంద్ర రెడ్డి, ఏఎన్‌ఎం శ్రీమతి సుభానీ బేగం, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మత్స్యకారుల చెంతకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.. కోవూరులో జనసేన సందడి!

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురంలో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. నెల్లూరు (కోవూరు): నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకారుల మధ్యకు వచ్చి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం తమకు ఎంతో భరోసాను కల్పించిందన్నారు మత్స్యకారులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురం మత్స్యకార గ్రామాన్ని ఆయన జనసేన నాయకులతో కలిసి సందర్శించడం మత్స్యకారులకు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందన్నారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల.రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కి వెంకటనారాయణపురం గ్రామంలోని మత్స్యకారులు ఆనందోత్సాహాలతో సంప్రదాయ కోలాటంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకారులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ఎల్లప్పుడూ మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.మత్స్యకార సంఘం నాయకులు ప్రసాద్, హరి, ఆంజనేయులు మరియు గ్రామ పెద్దల ఆత్మీయ ఆహ్వానం మేరకు బొమ్మిడి నాయకర్ గారు జనసేన నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించి మత్స్యకార కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకొచ్చిన జి.ఓ. నెం. 217ను అప్పట్లో పవన్ కళ్యాణ్ అడ్డంగా నిలచి తీవ్రంగా వ్యతిరేకించి, మత్స్యకార కుటుంబాల హక్కుల పరిరక్షణ కోసం అండగా నిలిచారని గుర్తు చేశారు.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భరోసాను రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచడం, సబ్సిడీపై డీజిల్ అందించడం, వలలు, టూ వీలర్లు, ఆటోలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మత్స్యకార కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గాదిరాజు జీవన్,ఆలియా, అలహరి సుధాకర్, ఉదయగిరి నాయకులు కాశీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి భారీ అభివృద్ధి పర్యటన

ఉదయగిరిలో రూ.1.69 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి. పరిశ్రమల స్థాపన ద్వారా 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడి. నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో రూ.1.69 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఘనంగా ప్రారంభించారు. ఉదయగిరి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.ఉదయగిరి ప్రాంత అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నాలుగు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా, వాటి ద్వారా సుమారు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనతో యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వలసలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.34.64 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ పర్యటనతో ఉదయగిరి అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎంపీ వేమిరెడ్డి పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటి సమస్యలు పరిష్కారమవడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో ఉదయగిరి ప్రాంతం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

News

ఫార్మా సిటీతో మనకు బంగారం పండుతుందా? — ప్రజల సందేహాలకు సమాధానం ఎవరిది?

ఫార్మా సిటీతో మనకు బంగారం పండుతుందా? — ప్రజల సందేహాలకు సమాధానం ఎవరిది? మేడిపల్లి, యాచారం మండలం: ముచ్చెర్ల ప్రాంతంలో ప్రతిపాదిత ఫార్మా సిటీపై మరోసారి చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఫార్మా సిటీతో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వస్తాయని చెబుతుండగా, పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాలు మాత్రం కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, వ్యవసాయానికి నష్టం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి వేదిక, మానవ హక్కుల వేదిక తెలంగాణ సంయుక్తంగా విడుదల చేసిన కరపత్రంలో, పటాన్‌చెరు, జీడిమెట్ల, కాజీపల్లి, పోలేపల్లి వంటి ప్రాంతాల్లో రసాయన పరిశ్రమల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. పరిశ్రమల వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవడం, చెరువులు దెబ్బతినడం, పంటల దిగుబడి తగ్గడం, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే పరిస్థితి ముచ్చెర్ల పరిసర గ్రామాలకు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా మేడిపల్లి, మీరాఖాన్‌పేట్, కురుమిద్ది, నందివనపర్తి, అయ్యవారిగూడెం, సింగారం, తాడిపర్తి, కందుకూరు, యాచారం ప్రాంతాల ప్రజల జీవన విధానంపై దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ పర్యావరణ ప్రభావ నివేదిక (EIA)లో కంపెనీల పేర్లు, తయారయ్యే ఉత్పత్తులు, వినియోగించే రసాయనాలు, వ్యర్థాల నిర్వహణ విధానం వంటి కీలక వివరాలు స్పష్టంగా లేవని ఆరోపించారు. అలాగే సుమారు 15.95 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొనడంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఈ అంచనా వాస్తవికంగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. పర్యావరణ చట్టాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగానే సంబంధిత గ్రామాలకు పూర్తి సమాచారం అందించాలని, ప్రజలకు నివేదికలు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ఫార్మా సిటీ అత్యాధునిక సాంకేతికతతో, కాలుష్య నియంత్రణ వ్యవస్థలతో ఏర్పాటు చేస్తున్నామని, పర్యావరణానికి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫార్మా సిటీ వల్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఒకవైపు, పర్యావరణం, ప్రజారోగ్యం, వ్యవసాయ భవిష్యత్తుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు పూర్తి సమాచారం అందించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. — పున్నమి న్యూస్ ప్రతినిధి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మత్స్యకార సొసైటీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

మనుబోలు మండలంలో అక్రమ వేలం పాటలపై కలెక్టర్ హిమన్షు శుక్లాకు యానాదుల సంఘం ఫిర్యాదు. మత్స్య శాఖ అధికారుల నిర్లక్ష్యంపై నిరసన తెలిపిన కేసీ పెంచలయ్య. నెల్లూరు: నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం పిడూరు & లక్ష్మీనరసింహపురం మత్స్యకార సొసైటీల పరిధిలో… నిబంధనలకు విరుద్ధంగా సభ్యులకు తెలియకుండా వేలం పాట నిర్వహించి, మత్స్య సంపదను దోచుకొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఈరోజు గ్రీవెన్స్ లో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమన్షు శుక్లాకి ఫిర్యాదు చేశారు. *ఈ సందర్బంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య మాట్లాడుతూ* పైన పేర్కొన్న సొసైటీల పరిధిలో సొసైటీ సభ్యులు మాత్రమే చేపలు పట్టుకొని జీవనం సాగించాలని, కానీ కొంతమంది సభ్యులకు తెలియకుండా వేలం పాటలు నిర్వహించి యానాదులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు… ఇదేమని ప్రశ్నించిన సభ్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.యానాదులకు ఇంత అన్యాయం జరుగుతున్నా మత్స్యశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయవలసినదిగా కోరారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రమేష్ మరియు సొసైటీ సెక్రటరీ గడ్డం ఓబయ్య, డైరెక్టర్ అద్దూరు రమణయ్య, సభ్యులు గడ్డం కృష్ణయ్య,మొలకల పోలయ్య,మొలకల చిన్న సుబ్బయ్య,కోవూరు చంద్రయ్య,యువనాయకులు సెనగల శ్రీనివాసులు, మొలకల బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్‌కు ఏమైంది? హిందూ దేవుళ్లను తిట్టే రావణ్‌కు మద్దతా!

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్‌కు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వడాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుపట్టారు. నెల్లూరు: హిందూ దేవుళ్ళు ఆచార సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ప్రశ్న రావణ్ కు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడాన్ని ఆక్షేపించారు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్న రావణ్ వ్యవహారం పై ఇవాళ ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ఎమ్మెల్యేగా కాకుండా ఓ సామాన్య భారతీయుడుగా మాట్లాడుతున్నా అంటూ మొదట తాను భారతీయుడిని, హిందువునని పరమతాలతో కలిసి నడిచే ధర్మం నాకు హిందూ ధర్మం నేర్పిందని అంటూ అన్ని కులాలు, మతాలను గౌరవించే తాను మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడానని క్రిస్టియన్ లకి అండగా ఉన్నానని అన్నారు.ఇవాళ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులకు జగన్ మద్దతు ఇస్తుంటే మాట్లాడాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి హిందూ మత విశ్వాసాలపై మాటల దాడులు చేస్తున్న జోసఫ్ ప్రశ్న రావణ్ ని ఎలా సమర్ధిస్తారు అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు దేవుళ్ళని నమ్మడం, నమ్మకపోవడం వారి ఇష్టం దేవుళ్ళని తిట్టే అధికారం రావణ్ కు ఎవరు ఇచ్చారని అన్నారు ఓ పక్క హే రామ్ అంటావు, మరో పక్క రావణ్ ని సమర్ధిస్తావ్అ సలు మీకు ఏమైంది జగన్ ? అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు.తాను బాధతో అడుగుతున్నాను రావణ్ మాట్లాడిన మాటలు విన్నారా రాముడిని, రామాయణ, మహా బారతలని జోసఫ్ రావణ్ మాట్లాడిన మాటలు వినలేదా జగన్అ న్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రశ్న జోసఫ్ రావణ్ పై అనేక కేసులు పెట్టారని ఉగ్రవాదులని సమర్ధించే రీతిలో మాట్లాడారని అలాంటి వ్యక్తులపై దేశద్రోహం కేసులు పెట్టకుంటే ఇంక ఏ కేసులు పెట్టాలి జగన్ గారు అంటూ సంబోధించారు.మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించే ఇలాంటి వ్యక్తులని జగన్ సమర్ధించడం దారుణమన్నారు.దేశ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్ చేశారు ఇవాళ హిందూ ధర్మంపై దాడి చేస్తున్న వారు భవిష్యత్ లో ఇతర మతలపై దాడులు చేయరా…? ప్రశ్న రావణ్ కు మద్దతు ఇవ్వడంపై జగన్ క్షమాపణ చెప్పుకుంటే ప్రజలు మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారు అంటూ ఆయన హెచ్చరికలు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ నేత ఈశ్వర్ నిప్పులు!

యూట్యూబ్ ఛానల్ అధినేత ప్రశ్న రావణ్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, జూలై 10న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ నెల్లూరు : భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యమేలుతోందని, “కార్పోరేట్ సంస్థలకు వరాలు.. సామాన్యుల పైన భారాలు అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతోందని అన్నారు సిపిఐ నేత ఈశ్వర్. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని, అలాగే పారిశ్రామిక రంగం ధ్వంసం అయిపోయిందని చెప్పారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిపోయి ఇతర మతాలపై దాడులు విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు.ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, సిక్కుల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. అలాగే ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.సామాన్యుడు రెండు పూటలా గొడ్డు చాకిరీ చేసినా.పూట గడవని పరిస్థితి నెలకొందని.దానికి తోడుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకానికి మారుపేరుగా కొనసాగుతోందని అన్నారు.. అక్కడ ఎన్డీయే ఇక్కడ ఎన్డీఏ అన్న చందంగా కొనసాగుతుందని చెప్పారు.ఏ సాకు దొరుకుతుందా నిత్యవసర సరుకులు ధరల పెంచుదామా అని ఎన్డీఏ ప్రభుత్వం ఎదురు చూస్తోందని,నరేంద్ర మోడీ పెంచుతున్న ధరలు ఓవైపు ఉంటే, అంతకుమించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ఎక్కువ ధరలు పెంచి.మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాడని చెప్పారు. శాంతి భద్రతలు దేశంలోనూ రాష్ట్రంలోనూ పూర్తిగా లోపించాయని అన్నారు.ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత ప్రశ్న రావణపై గత కొన్ని రోజులుగా వరుసగా పెట్టిన నాలుగు కేసుల్లోనూ.. న్యాయస్థానం ఈ కేసుల్లో పస లేదని బెయిల్ ఇచ్చినప్పటికీ, ఎలాగైనా కక్ష సాధించాలని దురుద్దేశంతో ప్రశ్నా రావణ్ పై దేశద్రోహ కేసు పెట్టి, రిమాండ్ కి తరలించడం దారుణమైన విషయమని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్నీ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది కానీ, రోడ్డు మీదకు వచ్చి వ్యతిరేకించే పరిస్థితి సిపిఐ సిపిఎం కు మాత్రమే ఉందని మిగతా పెద్ద రాజకీయ పార్టీలకు లేదని అన్నారు.బిజెపి ఆనందంగా ఉందని.రావణ్ ని కాబట్టి లోపల వేసాం.రాముడిని వ్యతిరేకించాడు కాబట్టి జైలు ఊచలు లెక్కపెట్టించాం.. అని ఆనందపడుతుందని అన్నారు.గతంలో పవన్ కళ్యాణ్ ఇంతకంటే దారుణమైన భాష వాడారని, లోకేష్ కూడా ఇంతకంటే ఎక్కువగానే మాట్లాడాడని, గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గతంలోనూ మాట్లాడారని అన్నారు. వీళ్ళందరూ మాట్లాడిన మాటల్లో లేనటువంటి ఇబ్బంది, రావణ్ మాట్లాడిన భాషలో ఏముందని ప్రశ్నించారు. రావణ్ ని విడుదల చేయాలని కోరుతూ ఈనెల 10వ తేదీ విజయవాడలోని సిపిఎం పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ లోపు ప్రభుత్వంలో మార్పు రాకపోతే కాక్రోచ్ లాంటి ఉద్యమం మొదలు పెడతామని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ!

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ: శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యం! పొదలకూరు: పొదలకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా శివ రాకేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు పొదలకూరులో విధులు నిర్వహించిన ఎస్సై హనీఫ్ సాధారణ బదిలీల్లో భాగంగా మనుబోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన శివ రాకేష్‌ను ప్రభుత్వం పొదలకూరుకు నియమించింది. ఈ సందర్భంగా శివ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ట్రాఫిక్ సమస్యల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ!

పొదలకూరు నూతన ఎస్సైగా శివ రాకేష్ బాధ్యతల స్వీకరణ: శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యం! పొదలకూరు: పొదలకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా శివ రాకేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు పొదలకూరులో విధులు నిర్వహించిన ఎస్సై హనీఫ్ సాధారణ బదిలీల్లో భాగంగా మనుబోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన శివ రాకేష్‌ను ప్రభుత్వం పొదలకూరుకు నియమించింది. ఈ సందర్భంగా శివ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ట్రాఫిక్ సమస్యల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.