Thursday, 9 July 2026

Blog

E-పేపర్

*» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్*

*❇️17న మెగా పీటీఎం* *» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్* అమరావతి, జూలై 6: ఈ నెల 17న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిం చింది. రంపచోడవరంలో జరిగే మెగా పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగు తాయి. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తారు.

ప్రకాశం

రేపు మాజీముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ.డా! Ys. రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి వేడుకలు

రేపు అనగా 08/07/2026 బుధవారం నాడు ఉదయం 9:30 గంటలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ.డా! Ys. రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్బంగా కందుకూరు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి,గౌ! శ్రీ బుర్రా. మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్దగల గౌరవనీయులు డా! ys. రాజశేఖరరెడ్డి గారి విగ్రహం దగ్గర జయంతి వేడుకలు సందర్బంగా  కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుంది.కావున మండలంలోని అన్నీ గ్రామాల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ఎస్సీ హాస్టళ్లలో ఏఎస్‌డబ్ల్యూ సుధామణి ఆకస్మిక తనిఖీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను ఏఎస్‌డబ్ల్యూ సుధామణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సంఖ్యలు, కేవైసీ నవీకరణలు, ఇతర నమోదు వివరాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు అందించారు.అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె సూచించారు. తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొని హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల వివరాలను ఏఎస్‌డబ్ల్యూ సుధామణికి వివరించారు.

కడప

కొత్తపల్లి వద్ద ఆక్సిడెంట్

పున్నమి ప్రతినిధి (జూలై 07) వేముల మండలం వి. కొత్తపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

News

నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2027 నోటిఫికేషన్ విడుదల!

🎓 నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2027 నోటిఫికేషన్ విడుదల! 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 📌 ముఖ్యాంశాలు ✅ 6వ తరగతి ప్రవేశాలు – 2027–28 ✅ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (ఉచితం) ✅ చివరి తేదీ: 31-07-2026 ✅ ప్రవేశ పరీక్ష: 28-11-2026 ✅ 2026–27లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 🌟 నవోదయ విద్యాలయాల ప్రత్యేకతలు 🏫 పూర్తిగా ఉచిత విద్య 🍛 ఉచిత హాస్టల్ & భోజనం 👕 ఉచిత యూనిఫాం & పాఠ్యపుస్తకాలు 📚 CBSE సిలబస్ ⚽ క్రీడలు, NCC, స్కౌట్స్ & గైడ్స్ వంటి సౌకర్యాలు 📲 మీ పిల్లలు, బంధువులు లేదా స్నేహితుల పిల్లలు 5వ తరగతి చదువుతున్నట్లయితే ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. 🌐 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు మరియు దరఖాస్తు వివరాల కోసం సందర్శించండి:

తిరుపతి

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జూలై 8న ఘన నివాళి కార్యక్రమం

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జూలై 8న ఘన నివాళి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 2026 జూలై 8వ తేదీ (బుధవారం) ఉదయం 9:00 గంటలకు వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం – ఎన్.జే.ఆర్. భవన్ ప్రాంగణంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నేదురుమల్లి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ *నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి* ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు తో కలిసి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు 🙏 నేదరుమల్లి కార్యాలయం

ఖమ్మం

ఊరికి దూరంగా స్త్రీ శక్తి భవనం నిర్మాణం – గ్రామస్తుల ఆగ్రహం*

*ఊరికి దూరంగా స్త్రీ శక్తి భవనం నిర్మాణం – గ్రామస్తుల ఆగ్రహం* ఏన్కూరు: హిమామ్ నగర్ గ్రామపంచాయతీ గ్రామ మహిళలకు ఉపయోగపడాల్సిన, స్త్రీ శక్తి భవనాన్ని గ్రామానికి దూరంగా అడవి ప్రాంతంలో నిర్మిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూరు మండలం హిమామ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం స్త్రీ శక్తి భవనాన్ని మంజూరు చేసింది. అయితే ఆ భవనాన్ని గ్రామ మధ్యలో నిర్మించకుండా, గ్రామానికి దూరంగా ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని అడవి ప్రాంతంలో నిర్మాణం చేపట్టడంతో గ్రామంలో చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు మాట్లాడుతూ, “స్త్రీ శక్తి భవనం అంటే మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడేది. దాన్ని ఊరికి దూరంగా, జన సంచారం లేని ప్రాంతంలో కడితే ఎవరు వస్తారు? మహిళలకు రాత్రి వేళల్లో వెళ్లడం కూడా కష్టం. దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు” అని మండిపడ్డారు. భవనం గ్రామానికి అందుబాటులో లేని ప్రాంతంలో ఉండటం వల్ల భవిష్యత్తులో దాని వినియోగం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. *వెంటనే నిలిపివేయాలి* ఇప్పటికైనా అధికారులు స్పందించి, అడవి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, స్త్రీ శక్తి భవనాన్ని గ్రామ మధ్యలో, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశంలో నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరుతున్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ మహిళలు, యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

E-పేపర్

సహాయం కోసం ఎదురు చూపులు

*ప్రతి ఒక్కరికి కాళ్లు పెట్టుకొని వేడుకుంటున్నాను సహాయం అందించండి* సహాయం కోసం ఎదురు చూపులు 🙏🙏 * *మీ విలువైన సహాయం పేదింటి చిన్నారి కోసం అందించండి*🙏 *సహాయం చిన్నదా పెద్దదా కాదు ప్రతిదీ చాలా విలువైన గొప్ప సహాయమే ఆపదలో సమయంలో exసహాయ చేసేవాడు దేవుడు కన్నా గొప్పవాడు* 🙏🙏🙏🙏 *గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు నా నమస్కారాలు దయచేసి* 🙏 *మీ పాప అనుకోని మా పాపకు కు*🙏 *సహాయం చేసి మా పాప ట్రీట్మెంట్ ఆగకుండా మీ వంతు సహాయం అందించగలరని ప్రతి ఒక్క పాదాలకు వేలవేల దండాలు వేడుకుంటున్నాను* 🙏🙏🙏🙏 *మా కుటుంబం మొత్తం మా పాప కోసం మీ కాళ్లు పట్టుకొని వేడుకుంటాం*🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏😭😭😭. *దయచేసి గ్రూప్లో ఉన్న పెద్దలు ఒకసారి మా పాప కోసం ఆగి మా బాధను అర్థం చేసుకోగలరని ప్రార్థన అందరూ ఇది ఫేక్ ఇది అబద్ధం అని డిలీట్ చేస్తున్నారు మా పాప హాస్పిటల్లో ఉండబట్టి 60 రోజులవుతుంది రోజుకు 20,000 ఖర్చు అవుతుంది అందుకనే ప్రతిరోజు పెడుతున్నాను. మీరు కోపగించుకోగా మా పాపకి సహాయం అందించండి.🙏🙏🙏 సహాయం ఎవరు చేయట్లేదు దయచేసి ఎవరైనా తన బిడ్డ కోసం అబద్ధాలు అడుతారా దయచేసి మీ పాప అనుకోని మా పాపకు మీ వంతు సహాయం అందించగలరని ప్రార్థన*😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *అందరికీ నమస్కారం* *45 రోజుల క్రితం పాప (female) జన్మించింది*. *కానీ మా ఆవిడకు ఏడవ నెలలోనే డెలివరీ అయ్యింది (premature delivery) ప్రస్తుతము తల్లి క్షేమంగా ఉంది కానీ ఏడవ నెలెలో పుట్టడం వలన పాప పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుత పాప వెంటిలేటర్ పై ఉంది. 4 రోజులకు మాకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయినవి. మరియు పాపను కనీసం 25 రోజులైనా హాస్పిటల్ ఉంచాలి అన్నారు. ప్రస్తుతానికి పాప ట్రీట్మెంట్ కి ఒక రోజుకి 25000/- అవుతున్నవి*. *ఇలాగే కొనసాగితే మొత్తం ట్రీట్మెంట్ అయ్యే వరకు 6 నుండి 7 లక్షల ఖర్చు అవుతుంది అన్నారు డాక్టర్ గారు*. *ఇప్పటికే నేను చాలా ఖర్చు పెట్టాను ఇంకా పెట్టడానికి నాకు ఆర్థిక స్థోమత లేదు*. *కనుక మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాను. మానవతా దృక్పథంతో, మీరు మీకు తోచినంత సహాయం చేయవలసినదిగా కోరుతున్నాను*. *పోన్ పే/ గూగుల్ పే నెంబర్* : *7680042731 పున్నమి న్యూస్ పేపర్ VINOD KUMAR *మీరు చేసే చిన్న సాయం మా చిన్న పాపకు పునర్జన్మను ప్రసాదిస్తుంది*

E-పేపర్

ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్

“ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్” అనే జాతీయ సంకల్పంతో అఖండ భారత నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

News

నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ*

*నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ* హత్య కేసులో ఇద్దరు ముద్దాయి లకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష ఒక్కొక్కరికి 50,000 చొప్పున జరిమాన. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS వారి ఆదేశాలు, గూడూరు DSP గారి మార్గదర్శకత్వంలో గుడ్ ట్రయిల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా నెల్లూరు జిల్లా పోలీసులు సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. *కేసు వివరాలు* : ఈ కేసులో A 2 ముద్దాయి అయిన చింతలూరు అలియాస్ కలతూరు మానస మృతుడు కలతురు రూపేష్ యొక్క భార్య. వీరు సుమారు 10 సంవత్సరముల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. మృతుడు ప్రైవేట్ గా ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అంతట మృతని భార్య అయిన A2 గూడూరు రూరల్ మండలం కొండగుంట గ్రామానికి చెందిన A 1 అయిన ఎంట్రపాటి రవివర్మ అను అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. సదరు అక్రమ సంబంధం గురించి మానస భర్తకు తెలిసి సదరు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగినవి. తరువాత A 1 మరియు A 2 లు ఇద్దరూ ఎలాగైనా రూపేష్ అడ్డు తొలగించుకోవాలని, చంపుదామని నిర్ణయించుకొని తేదీ: 18.2.2021 న మానస మరియు రవి వర్మ మాట్లాడుకొని అదే రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మానస మరియు రవి వర్మ ఇద్దరూ కలిసి రవి వర్మ తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తన ఇంట్లో నిద్రపోతున్న రూపేష్ను తలపై, నుదిటి పై అనేకమార్లు బలంగా కొట్టగా రూపేష్ కు తల పగిలి మెదడు బయటికి వచ్చి అక్కడికక్కడే చనిపోయినాడు. సదరు కేసులో గౌరవనీయులైన VII th Additional District Judge K.Venkata Naga Pavan గారు ముద్దాయిలిద్దరికీ పై సెక్షన్ల మేరకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి 50వేల రూపాయలు చొప్పున జరిమాన విధించినారు. సదరు జరిమాన కట్టని యెడల అదనంగా 6 నెలల జైలు శిక్ష. కేసును సమర్థవంతంగా విచారించి దోషులకు శిక్ష పడేలాగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన కొత్తపల్లి వసంత కుమార్ గారు, సాక్షులను సరైన సమయంలో కోర్టు నందు హాజరు పరిచి కేసును పర్యవేక్షించిన గూడూరు వన్ టౌన్ CI గారు K.శేఖర్ బాబు గారు, కోర్టు లైసెన్ ఆఫీసర్ అయిన D.మల్లికార్జున, మరియు కోర్టు హెడ్ కానిస్టేబుల్స్ U.V. రమణయ్య మరియు P. సుబ్రహ్మణ్యేశ్వర రావు గారిని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు అభినందించినారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.