Thursday, 9 July 2026
  • Home  
  • నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ*
- News

నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ*

*నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ* హత్య కేసులో ఇద్దరు ముద్దాయి లకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష ఒక్కొక్కరికి 50,000 చొప్పున జరిమాన. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS వారి ఆదేశాలు, గూడూరు DSP గారి మార్గదర్శకత్వంలో గుడ్ ట్రయిల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా నెల్లూరు జిల్లా పోలీసులు సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. *కేసు వివరాలు* : ఈ కేసులో A 2 ముద్దాయి అయిన చింతలూరు అలియాస్ కలతూరు మానస మృతుడు కలతురు రూపేష్ యొక్క భార్య. వీరు సుమారు 10 సంవత్సరముల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. మృతుడు ప్రైవేట్ గా ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అంతట మృతని భార్య అయిన A2 గూడూరు రూరల్ మండలం కొండగుంట గ్రామానికి చెందిన A 1 అయిన ఎంట్రపాటి రవివర్మ అను అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. సదరు అక్రమ సంబంధం గురించి మానస భర్తకు తెలిసి సదరు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగినవి. తరువాత A 1 మరియు A 2 లు ఇద్దరూ ఎలాగైనా రూపేష్ అడ్డు తొలగించుకోవాలని, చంపుదామని నిర్ణయించుకొని తేదీ: 18.2.2021 న మానస మరియు రవి వర్మ మాట్లాడుకొని అదే రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మానస మరియు రవి వర్మ ఇద్దరూ కలిసి రవి వర్మ తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తన ఇంట్లో నిద్రపోతున్న రూపేష్ను తలపై, నుదిటి పై అనేకమార్లు బలంగా కొట్టగా రూపేష్ కు తల పగిలి మెదడు బయటికి వచ్చి అక్కడికక్కడే చనిపోయినాడు. సదరు కేసులో గౌరవనీయులైన VII th Additional District Judge K.Venkata Naga Pavan గారు ముద్దాయిలిద్దరికీ పై సెక్షన్ల మేరకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి 50వేల రూపాయలు చొప్పున జరిమాన విధించినారు. సదరు జరిమాన కట్టని యెడల అదనంగా 6 నెలల జైలు శిక్ష. కేసును సమర్థవంతంగా విచారించి దోషులకు శిక్ష పడేలాగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన కొత్తపల్లి వసంత కుమార్ గారు, సాక్షులను సరైన సమయంలో కోర్టు నందు హాజరు పరిచి కేసును పర్యవేక్షించిన గూడూరు వన్ టౌన్ CI గారు K.శేఖర్ బాబు గారు, కోర్టు లైసెన్ ఆఫీసర్ అయిన D.మల్లికార్జున, మరియు కోర్టు హెడ్ కానిస్టేబుల్స్ U.V. రమణయ్య మరియు P. సుబ్రహ్మణ్యేశ్వర రావు గారిని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు అభినందించినారు.

*నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ*
హత్య కేసులో ఇద్దరు ముద్దాయి లకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష ఒక్కొక్కరికి 50,000 చొప్పున జరిమాన.
నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS వారి ఆదేశాలు, గూడూరు DSP గారి మార్గదర్శకత్వంలో గుడ్ ట్రయిల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా నెల్లూరు జిల్లా పోలీసులు సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

*కేసు వివరాలు* :
ఈ కేసులో A 2 ముద్దాయి అయిన చింతలూరు అలియాస్ కలతూరు మానస మృతుడు కలతురు రూపేష్ యొక్క భార్య. వీరు సుమారు 10 సంవత్సరముల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. మృతుడు ప్రైవేట్ గా ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అంతట మృతని భార్య అయిన A2 గూడూరు రూరల్ మండలం కొండగుంట గ్రామానికి చెందిన A 1 అయిన ఎంట్రపాటి రవివర్మ అను అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. సదరు అక్రమ సంబంధం గురించి మానస భర్తకు తెలిసి సదరు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగినవి. తరువాత A 1 మరియు A 2 లు ఇద్దరూ ఎలాగైనా రూపేష్ అడ్డు తొలగించుకోవాలని, చంపుదామని నిర్ణయించుకొని తేదీ: 18.2.2021 న మానస మరియు రవి వర్మ మాట్లాడుకొని అదే రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మానస మరియు రవి వర్మ ఇద్దరూ కలిసి రవి వర్మ తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తన ఇంట్లో నిద్రపోతున్న రూపేష్ను తలపై, నుదిటి పై అనేకమార్లు బలంగా కొట్టగా రూపేష్ కు తల పగిలి మెదడు బయటికి వచ్చి అక్కడికక్కడే చనిపోయినాడు.

సదరు కేసులో గౌరవనీయులైన VII th Additional District Judge K.Venkata Naga Pavan గారు ముద్దాయిలిద్దరికీ పై సెక్షన్ల మేరకు జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి 50వేల రూపాయలు చొప్పున జరిమాన విధించినారు. సదరు జరిమాన కట్టని యెడల అదనంగా 6 నెలల జైలు శిక్ష.

కేసును సమర్థవంతంగా విచారించి దోషులకు శిక్ష పడేలాగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన కొత్తపల్లి వసంత కుమార్ గారు, సాక్షులను సరైన సమయంలో కోర్టు నందు హాజరు పరిచి కేసును పర్యవేక్షించిన గూడూరు వన్ టౌన్ CI గారు K.శేఖర్ బాబు గారు, కోర్టు లైసెన్ ఆఫీసర్ అయిన D.మల్లికార్జున, మరియు కోర్టు హెడ్ కానిస్టేబుల్స్ U.V. రమణయ్య మరియు P. సుబ్రహ్మణ్యేశ్వర రావు గారిని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు అభినందించినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.