శ్రీకాళహస్తి, జూన్ 08, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్థానిక తనూస్ మెన్స్ సెలూన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శాలువా కప్పి, కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు నెమలూరు బుజ్జి, కైలాసాని సాయి కుమార్, మునిరాజా యాదవ్, రమేష్ గౌడ్, కాకి అంకయ్య, రమేష్, షేక్ జూమ్లేష కృష్ణ, చెంబేడు బాలయ్య, సులేమాన్, శివకుమార్, నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా టీడీపీ నేత కోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు