శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ వలయాధికారి (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్‌ను శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్‌కు దుశ్శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలో రోజురోజుకూ జటిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యలను క్రమబద్ధీకరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, పార్టీ సీనియర్ నాయకులు నాగూర్ షేక్, మునికృష్ణయ్య, చందు, అరుణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సిఐ వెంకటేష్‌కు కాంగ్రెస్ నేతల సన్మానం