శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము ఎంతో కాలంగా శ్రమిస్తున్న ‘స్కిట్’ ఇంజనీరింగ్ కాలేజీ పునఃప్రారంభంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పక్కా భరోసా ఇచ్చారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేదికపైనే మంత్రి లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కళాశాల పునఃప్రారంభానికి కావలసిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే లభించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనంతపూర్ అనుసంధానంతో త్వరలోనే శ్రీకాళహస్తి నుంచే నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. విద్యతో పాటు శ్రీకాళహస్తి ప్రాంతానికి మరిన్ని కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారని సుధీర్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గ విద్యా, పారిశ్రామిక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పూర్తి మద్దతు పలికిన మంత్రి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

త్వరలోనే ‘స్కిట్’ కాలేజీ పునఃప్రారంభం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి