Friday, 10 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వరాలయంలో జూలై 9న ‘సామూహిక అక్షరాభ్యాసం’
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో జూలై 9న ‘సామూహిక అక్షరాభ్యాసం’

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 09-07-2026 (గురువారం) ఉదయం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన ప్రాంగణంలోని శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఉదయం 8:00 గంటలకు ఈ విశేష వేడుక ప్రారంభం కానుంది. తమ పిల్లలకు అక్షరాభ్యాసం (విద్యారంభం) చేయించాలనుకునే తల్లిదండ్రులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన అధికారులు కోరారు. చదువుల దేవుడైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి దివ్య అనుగ్రహంతో పిల్లల విద్యాభ్యాసం గొప్పగా సాగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పవిత్ర మహోత్సవంలో భక్తులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దేవస్థానంలో నిర్వహించబడు ఇతర సేవలు మరియు దర్శన టిక్కెట్లను భక్తులు తమ మొబైల్ ద్వారా ‘మన మిత్ర వాట్సాప్’ (9552300009) నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.