శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు మృత్యుంజయ మూలవిరాట్ స్వామివారి సన్నిధిలో కలశ స్థాపన చేసి, పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ధూప, దీప, కర్పూర హారతులు సమర్పించడంతో పాటు ప్రత్యేక నైవేద్యాలు అర్పించారు. ఈ సందర్భంగా లోకక్షేమం, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సర్వసంపదలు కలగాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, పీఆర్ఓ రవి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా మృత్యుంజయ స్వామి ప్రత్యేక పూజలు