Saturday, 18 April 2026
  • Home  
  • 1,999కే లివర్ టెస్ట్ – నెల్లూరులో అపోలో ఆఫర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

1,999కే లివర్ టెస్ట్ – నెల్లూరులో అపోలో ఆఫర్

ఫ్యాటీ లివర్ ( కాలేయంలో కొవ్వు చేరడం ) అనేది ప్రాథమిక దశలో అంత ప్రమాదకరం అనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ హిమ బిందు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి హెచ్చరించారు. ఈనెల 19వ తేదీనా ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అపోలో హాస్పిటల్ లో డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి మీడియాతో మాట్లాడారు. ప్రారంభ దశలోనే ప్యాటీ లివర్ ను గుర్తిస్తే దానికి సంభందించిన వ్యాధులను నివారించడం చాలా సులువు అని చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతోనే అది సాధ్యమన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అపోలో సంస్థ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టిందన్నారు. 4,400/- రూపాయల విలువైన లివర్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం 1,999/- రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ( CBC ), లివర్ ఫంక్షన్ టెస్ట్ ( LFT ), కొలెస్ట్రాల్ పరీక్ష ( Cholesterol ), లివర్ స్కాన్ ( Fibroscan ) పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యుల సూచనలు, సలహాలు ( Gastro Consultation ) ఉంటాయన్నారు. ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ మే నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుందని డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపాయింట్‌మెంట్ కోసం 0861-666 7 333 / 235 8 333 ఈ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో భాగంగా ఫ్యాటీ లివర్ వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి తెలియజేశారు. కొవ్వు పెరగడం వల్ల కాలేయం వాపుకు గురౌతుందని, దీర్ఘకాలం పాటు కొవ్వు పేరుకుపోవడం కారణంగా కాలేయం గట్టిపడి, శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతే కాకుండా దీనివల్ల టైప్-2 డయాబెటిస్, రక్తపోటు (BP) మరియు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని, చివరకు కాలేయం పూర్తిగా పనిచేయలేని పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలో వేయించిన పదార్ధాలు, జంక్ ఫుడ్, మిఠాయిలను తినడం తగ్గించుకోవాలని, పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు మరియు తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేర్చుకుని తినాలని సూచించారు. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కాలేయంపై ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుందని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని వెల్లడించారు. క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ పరీక్ష తప్పనిసరి అని సూచించారు. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ్యాటీ లివర్ ( కాలేయంలో కొవ్వు చేరడం ) అనేది ప్రాథమిక దశలో అంత ప్రమాదకరం అనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ హిమ బిందు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి హెచ్చరించారు. ఈనెల 19వ తేదీనా ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అపోలో హాస్పిటల్ లో డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి మీడియాతో మాట్లాడారు. ప్రారంభ దశలోనే ప్యాటీ లివర్ ను గుర్తిస్తే దానికి సంభందించిన వ్యాధులను నివారించడం చాలా సులువు అని చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతోనే అది సాధ్యమన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అపోలో సంస్థ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టిందన్నారు. 4,400/- రూపాయల విలువైన లివర్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం 1,999/- రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ( CBC ), లివర్ ఫంక్షన్ టెస్ట్ ( LFT ), కొలెస్ట్రాల్ పరీక్ష ( Cholesterol ), లివర్ స్కాన్ ( Fibroscan ) పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యుల సూచనలు, సలహాలు ( Gastro Consultation ) ఉంటాయన్నారు. ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ మే నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుందని డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపాయింట్‌మెంట్ కోసం 0861-666 7 333 / 235 8 333 ఈ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో భాగంగా ఫ్యాటీ లివర్ వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి తెలియజేశారు. కొవ్వు పెరగడం వల్ల కాలేయం వాపుకు గురౌతుందని, దీర్ఘకాలం పాటు కొవ్వు పేరుకుపోవడం కారణంగా కాలేయం గట్టిపడి, శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతే కాకుండా దీనివల్ల టైప్-2 డయాబెటిస్, రక్తపోటు (BP) మరియు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని, చివరకు కాలేయం పూర్తిగా పనిచేయలేని పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలో వేయించిన పదార్ధాలు, జంక్ ఫుడ్, మిఠాయిలను తినడం తగ్గించుకోవాలని, పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు మరియు తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేర్చుకుని తినాలని సూచించారు. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కాలేయంపై ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుందని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని వెల్లడించారు. క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ పరీక్ష తప్పనిసరి అని సూచించారు. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.