Saturday, 18 April 2026
  • Home  
  • మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.
- ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

విజయవాడ: పున్నమి ప్రతినిధి సురేష్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ డీలిమిటేషన్ పేరుతో దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలనే కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిన రాజకీయ నాటకం లోక్‌సభలో పూర్తిగా బట్టబయలై అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అబద్ధాలు, కుట్రలు, రహస్య అజెండాలతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలన్న మోదీ సర్కార్ యత్నానికి పార్లమెంట్ గట్టి సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దేశ సమగ్రతకు, రాష్ట్రాల సమానత్వానికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు జనాభా ప్రమాణాల పేరుతో పార్లమెంట్ ప్రతినిధిత్వాన్ని తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రాష్ట్రానికి రావాల్సిన రాజకీయ హక్కులను కోల్పోయేలా చేసే ఈ చర్యకు మద్దతు తెలుపుతున్న ఎన్డీఏ కూటమి, వైఎస్సార్సీపీ నాయకత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రమాదకర నిర్ణయమని స్పష్టం చేశారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కనిపించే బాడుగ కన్నీళ్లు కర్చే “రుదాయలి” సంప్రదాయం మాదిరిగా, ప్రజల బాధలను నాటకంగా మార్చి రాజకీయ లాభాల కోసం నకిలీ కన్నీళ్లు కారుస్తున్న పాలక వర్గాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఇవ్వకుండా భావోద్వేగాలతో మోసం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనీ,ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం సీపీఐ నిరంతరం పోరాటంలో ముందుంటునదని గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ సంద్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు అధిక చార్జీలు వసూలు చేయడం, అవసరం లేని పరీక్షలు చేయించడం, రోగులను దోపిడీ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది వైద్యులు, ఆసుపత్రుల అక్రమ చర్యల వల్ల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్‌లు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తక్షణం అరికట్టకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30 తేదిన డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల ముందు భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి,నకిలీ వైద్య సేవలను పూర్తిగా నిర్మూలించాలి,ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ఉచిత, నాణ్యమైన సేవలు అందించాలి, ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్.సుభహని ఆఫీస్ బేరర్స్ కొంగర శ్రీనివాసులు,వై.బాబీ, కొన్న శ్రీనివాస్ లంకా గోవిందరాజులు పోతుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

విజయవాడ: పున్నమి ప్రతినిధి సురేష్
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ డీలిమిటేషన్ పేరుతో దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలనే కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిన రాజకీయ నాటకం లోక్‌సభలో పూర్తిగా బట్టబయలై అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అబద్ధాలు, కుట్రలు, రహస్య అజెండాలతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలన్న మోదీ సర్కార్ యత్నానికి పార్లమెంట్ గట్టి సమాధానం చెప్పిందని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దేశ సమగ్రతకు, రాష్ట్రాల సమానత్వానికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు జనాభా ప్రమాణాల పేరుతో పార్లమెంట్ ప్రతినిధిత్వాన్ని తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రాష్ట్రానికి రావాల్సిన రాజకీయ హక్కులను కోల్పోయేలా చేసే ఈ చర్యకు మద్దతు తెలుపుతున్న ఎన్డీఏ కూటమి, వైఎస్సార్సీపీ నాయకత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రమాదకర నిర్ణయమని స్పష్టం చేశారు.
బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కనిపించే బాడుగ కన్నీళ్లు కర్చే “రుదాయలి” సంప్రదాయం మాదిరిగా, ప్రజల బాధలను నాటకంగా మార్చి రాజకీయ లాభాల కోసం నకిలీ కన్నీళ్లు కారుస్తున్న పాలక వర్గాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఇవ్వకుండా భావోద్వేగాలతో మోసం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనీ,ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం సీపీఐ నిరంతరం పోరాటంలో ముందుంటునదని గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
ఈ సంద్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు అధిక చార్జీలు వసూలు చేయడం, అవసరం లేని పరీక్షలు చేయించడం, రోగులను దోపిడీ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది వైద్యులు, ఆసుపత్రుల అక్రమ చర్యల వల్ల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్‌లు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని తక్షణం అరికట్టకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30 తేదిన డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల ముందు భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి,నకిలీ వైద్య సేవలను పూర్తిగా నిర్మూలించాలి,ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ఉచిత, నాణ్యమైన సేవలు అందించాలి, ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్.సుభహని ఆఫీస్ బేరర్స్ కొంగర శ్రీనివాసులు,వై.బాబీ, కొన్న శ్రీనివాస్ లంకా గోవిందరాజులు పోతుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.